ముంబై దాడుల కీలక సూత్రధారి ఆజం చీమా మృతి
26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆజం చీమా మృతి మరణించాడు. (Mumbai terror attack mastermind Azam Cheema passes away) పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ నగరంలో గుండెపోటుతో కన్నమూశాడు. అతడు 2000 సంత్సరం నుంచి పాక్ లోని బహవల్ పూర్ లో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
2008 ముంబై దాడుల కీలక ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ ఆజం చీమా (70) పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సీనియర్ కమాండర్ అయిన చీమా 26/11 ఉగ్రదాడులు, 2006 జూలైలో ముంబైలో 188 మందిని పొట్టనబెట్టుకున్న రైలు బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
వావ్.. హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్
‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. లష్కరే తోయిబా కార్యకలాపాల్లో చీమా కీలక కమాండర్ అని, అతడికి ఉసామా బిన్ లాడెన్ కు చెందిన అల్ ఖైదా నెట్ వర్క్ తో సంబంధాలు ఉన్నాయని అమెరికా ట్రెజరీ విభాగం పేర్కొంది. లష్కరే తోయిబాను అమెరికా 2001 డిసెంబరులో, ఐక్యరాజ్యసమితి కమిటీ 2005 మేలో విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ఉన్నత విద్యతో అధిక జీవిత కాలం.. వృద్ధాప్యమూ నెమ్మదిగానే - కొత్త స్టడీలో ఆసక్తికర విషయాలు..
ఛీమాను అంతుచిక్కని పంజాబీ మాట్లాడే, గడ్డం ఉన్న, బాగా నిర్మించిన లష్కరే తోయిబా కార్యకర్తగా ఇంటెలిజెన్స్ వర్గాలు అభివర్ణించాయి. 2000వ దశకం ప్రారంభంలో పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆరుగురు బాడీగార్డులతో ల్యాండ్ క్రూయిజర్ కారులో తిరుగుతూ ఉండేవాడు.
బహవల్ పూర్ శిబిరంలో ఆయుధ శిక్షణ పొందుతున్న జిహాదీలను బ్రెయిన్ వాష్ చేసేందుకు ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ హమీద్ గుల్, బ్రిగేడియర్ రియాజ్, కల్నల్ రఫీక్ లను రప్పించింది చీమానే. అతడు అప్పుడప్పుడు కరాచీ, లాహోర్ శిక్షణా శిబిరాలను కూడా సందర్శించేవాడు. 2008లో చీమా పాకిస్థాన్ లోని బహవల్ పూర్ కు లష్కరే తోయిబా కమాండర్ గా పనిచేశాడు. ఆ తర్వాత లష్కరే సీనియర్ కార్యకర్త జకీ-యువర్-రెహ్మాన్ లఖ్వీకి ఆపరేషన్స్ అడ్వైజర్గా నియామకం అయ్యాడు. 26/11 ముంబై దాడుల ప్రణాళిక, అమలులో చీమా కీలకంగా వ్యవహరించాడు.