Asianet News TeluguAsianet News Telugu

పబ్జీ కోసం రూ.10లక్షలు కాజేసిన టీనేజర్..!

ముంబయికి చెందని ఓ టీనేజ్ కుర్రాడు తన తల్లి బ్యాంక్ ఎకౌంట్ నుంచి రూ.పది లక్షలు కాజేశాడు. అనంతరం ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

Mumbai teen spends rs.10 lakh from mother account on PUBG, Runs Away
Author
Hyderabad, First Published Aug 28, 2021, 11:24 AM IST

ఈ కాలం యువతలో చాలా మందికి పబ్జీ అంటే పిచ్చి. దీనికి బానిసలుగా మారి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా.. ఓ టీనేజ్ కుర్రాడు.. ఈ ఫబ్జీ గేమ్ కోసం తన తల్లి ఖాతాలో నుంచి  ఏకంగా రూ..10లక్షలు కాజేశాడు. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానంటూ లెటర్ రాసి పెట్టిమరీ వెళ్లాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయికి చెందని ఓ టీనేజ్ కుర్రాడు తన తల్లి బ్యాంక్ ఎకౌంట్ నుంచి రూ.పది లక్షలు కాజేశాడు. అనంతరం ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అది చూసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.... పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించగా.. ఇంటి నుంచి రూ.5 కిలో మీటర్ల దూరంలో ఉండే మహంకాళీ గుహల్లో భయపడుతూ పోలీసులకు కనిపించాడు.

విచారణలో భాగంగా తల్లిదండ్రులను పలను ప్రశ్నలు అడగగా..  గత నెల నుంచే తమ పిల్లాడు పబ్జీ  గేమ్ కి అలవాటు పడినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ తల్లి ఖాతా నుంచి రూ.10లక్షలు ఖర్చు చేశాడన్నారు. పేరెంట్స్ మందిలించే సరికి ఇంట్లో నుంచి పారిపోయినట్లు తెలిసింది. దీంతో.. బాలుడి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios