ముంబై:ముంబైలోని కార్ ప్రాంతంలో  ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ భవనంలో పలువురు చిక్కుకొన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ భవనంలో పలువురు నివసిస్తున్నారు.మంగళవారం నాడు మధ్యాహ్నం ఈ భవనం కుప్పకూలింది. ఈ భవనంలో  చిక్కుకొన్న 30 మందిని ఎన్డీఆర్‌ఎప్ సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భవనం కుప్పకూలిన ఘటనలో ఇంకా పలువురు చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.