సయ్యద్ డిగ్రీ విద్యార్థి తో మానసికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి తిరగడం మొదలుపెట్టారు. అయితే.. ఇటీవల వీరిద్దిరికీ ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ మోడల్ దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసి.. అనంతరం ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ దారుణ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరానికి చెందిన మానసి దీక్షిత్ (20) మోడలింగ్ చేస్తున్నారు. మానసి దీక్షిత్ ఆరునెలలక్రితం ముంబై నగరానికి వచ్చి అంధేరిలోని మిల్లత్ నగర్ లో నివాసం ఉంటోంది.
కాగా.. కొంత కాలం క్రితం అంధేరికి చెందిన సయ్యద్ (19) డిగ్రీ విద్యార్థి తో మానసికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి తిరగడం మొదలుపెట్టారు. అయితే.. ఇటీవల వీరిద్దిరికీ ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ గొడవ ముదరడంతో ఆవేశంలో సయ్యద్ ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టి దాన్ని మలాద్ ప్రాంతంలోని మైండ్ స్పేస్ వద్ద పొదల్లో పడేశాడు. స్థానికులు బ్యాగు నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు వచ్చి బ్యాగు విప్పి చూడగా మోడల్ మానసి దీక్షిత్ మృతదేహం కనిపించింది. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా సయ్యద్ క్యాబ్ లో తీసుకువచ్చి మృతదేహాన్ని పొదల్లో పడేసినట్లు తేలింది. దీంతో పోలీసులు సయ్యద్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
