మహారాష్ట్రలో గతేడాది సెప్టెంబర్‌లో నిర్బయ తరహాలో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మోహన్ కత్వారు చౌహాన్ అనే వ్యక్తి ఓ మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చిన ముంబైలోని సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.
మహారాష్ట్రలో గతేడాది సెప్టెంబర్‌లో నిర్బయ తరహాలో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మోహన్ కత్వారు చౌహాన్ అనే వ్యక్తి ఓ మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చిన ముంబైలోని సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడిగా మోహన్ కత్వారు చౌహాన్‌ను సోమవారం న్యాయమూర్తి హెచ్‌సీ షెండే దోషిగా నిర్దారించారు. శిక్ష ఖరారును వాయిదా వేశారు. బుధవారం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహేష్ ములే.. దోషికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. “ఇది రాత్రిపూట నిస్సహాయ, ఒంటరి మహిళపై భయంకరమైన, దౌర్జన్యపూరిత దాడి. ఇది ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరంలో మహిళ భద్రతపై భయాన్ని పెంచుతుంది. ఈ కేసు అరుదైన అరుదైన కేసుల ప్రమాణాలకు సరిగ్గా సరిపోతుంది. అందుకే నిందితులు మరణశిక్ష విధించాలి’’ అని కోరారు. అయితే తాజాగా దోషికి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
గతేడాది సెప్టెంబర్‌లో ముంబై పరిసరాల్లో సకినాకా ప్రాంతంలో మోహన్ చౌహాన్.. ఆపి ఉంచిన టెంపోలో 34 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్‌లలో రాడ్‌ని అమర్చాడు. ఆ మహిళ మరుసటి రోజు రక్తస్రావం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే త్వరితగతిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడు మోహన్ చౌహాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై మూడు వారల్లోపే చార్జీషీట్ దాఖలు చేశారు. 346 పేజీల ఛార్జిషీట్ ప్రకారం.. బాధితురాలికి నిందితుడు ముందే తెలుసు. నేరం జరగడానికి 25 రోజుల ముందు నిందితులు మహిళను కలవడానికి, సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ అతను విజయం సాధించలేదు. అందుకే చాలా కాలం తర్వాత అతడిని కలిసినప్పుడు ఆవేశానికి లోనైన అతడు ఆమెతో ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. అందులో ఇనుప రాడ్ కూడా ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
