Asianet News TeluguAsianet News Telugu

26/11 తరహా దాడికి పాల్పడుతాం.. ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్.. పాక్‌లో నెంబర్ లోకేషన్!

ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు శుక్రవారం రాత్రి వచ్చిన ఓ మెసేజ్ కాల్‌ తీవ్ర కలకలం రేపింది. కంట్రోల్ సెల్‌కు గుర్తుతెలియని వ్యక్తి.. 26/11 అటాక్స్ లేదా ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య లేదా సిద్దూ మూసేవాలా హత్య లాంటి దాడులు జరుగుతాయని బెదిరింపు సందేశం పంపాడు. 

Mumbai Police receives threatening message attack like 26 11 number traced to Pakistan says reports
Author
First Published Aug 20, 2022, 11:12 AM IST

ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు శుక్రవారం రాత్రి వచ్చిన ఓ మెసేజ్ కాల్‌ తీవ్ర కలకలం రేపింది. కంట్రోల్ సెల్‌కు గుర్తుతెలియని వ్యక్తి.. 26/11 అటాక్స్ లేదా ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య లేదా సిద్దూ మూసేవాలా హత్య లాంటి దాడులు జరుగుతాయని బెదిరింపు సందేశం పంపాడు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. ట్రాఫిక్ కంట్రోల్ సెల్ వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన బెదిరింపు సందేశం పాకిస్తాన్ నెంబర్ నుంచి వచ్చినట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాల తెలిపినట్టుగా పేర్కొంది.

తనని స్థానాన్ని గుర్తించినట్లయితే' అది బయట ఉన్నట్టుగా తేలుతుందని మెసేజ్ పంపిన వ్యక్తి చెప్పాడు. ముంబైలో దాడి జరుగుతుందని మెసేంజర్ బెదిరించాడు. ‘‘భారత్‌లోని ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడతారు’’ అని తెలిపాడు. ఈ బెదిరింపు సందేశంపై భద్రతా బలగాలు విచారణ జరుపుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

‘‘మేము దీనిని పరిశీలిస్తున్నాము. రాత్రి నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇతర ఏజెన్సీలకు కూడా సమాచారం అందించబడింది”అని ఆ వర్గాలు తెలిపాయి. ఇది ఫ్రాంక్ సందేశమా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ బెదిరింపు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అన్నారు. ఈ విషయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా స్పందించారు. ‘‘మొదట రాయగడ తీరంలో బోటు రికవరీ, ఇప్పుడు పోలీసుల బెదిరింపు సందేశం. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?’’ అని ఆమె ప్రశ్నించారు. 

ఇక, ఇటీవల రాయగఢ్‌లోని హరిహరేశ్వర్‌ బీచ్‌లో అనుమానాస్పద బోటును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో మూడు ఏకే 47లు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు, మరికొన్ని తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న రెండు రోజుల తర్వాత తాజా బెదిరింపులు రావడంతో అధికారులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios