Asianet News TeluguAsianet News Telugu

రైల్వే ఉద్యోగి సాహసం.. పట్టాలపై చిన్నారిని కాపాడి..

మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. 

mumbai points man mayur shelkhe saves child who fell on the tracks seconds before train
Author
Hyderabad, First Published Apr 19, 2021, 1:44 PM IST

రైల్వే ఉద్యోగి చేసిన ఓ సాహం.. చిన్నారి ప్రాణం కాపాడింది. రైలు పట్టాలపై పడి ఉన్న ఓ చిన్నారిని రెప్పపాటులో ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా  రైల్వే పట్టాలపై పడిపోయింది.  మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. 

పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో  రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై  కేంద్ర  రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను  కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios