Mumbai Murder: రెండు బకెట్ల నిండా రక్తం, కొన్ని ముక్కలను ఉడికించి, రోస్ట్ చేసి.. నిందితుడికి హెచ్ఐవీ
మహారాష్ట్రలో దారుణ హత్య జరిగింది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న భాగస్వామిని చంపేసి ముక్కలు చేశాడు. ఆ ముక్కలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాడు. రోస్ట్ చేశాడు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లితే కిచెన్‌లో రెండు బకెట్ల నిండా నెత్తురే కనిపించింది.

ముంబయి: మహారాష్ట్రలో భయంకర హత్య జరిగింది. 56 ఏళ్ల మనోజ్ రమేశ్ సానె 32 ఏళ్ల సరస్వతి వైద్యను కిరాతకంగా చంపేశాడు. ఆమె బాడీని ముక్కలుగా నరికేశాడు. ట్రీ కట్టర్ ద్వారా ముక్కలు చేశాడు. వాటిలో కొన్నింటిని కుక్కర్‌లో ఉడికించాడు. కొన్నింటిని రోస్ట్ చేశాడు. ఎవరు గుర్తు పట్టకూడదనే ఇలా చేశాడు. పోలీసులు ఆ ఇంటిలోకి వెళ్లడంతో రెండు బకెట్ల నిండా నెత్తురు ఉన్నట్టు గుర్తించారు. ఆ రక్తంలో కొన్ని చిన్న చిన్న బాడీ ముక్కలూ ఉన్నాయని తెలిసింది. జూన్ 7న ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 16వ తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 2008లో నిందితుడు మనోజ్ సానెకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నదని తెలిసంది. అప్పటి నుంచి మందులు వాడుతున్నాడు. గతంలో తనకు యాక్సిడెంట్ అయినప్పుడు వేరే బ్లడ్ ఎక్కించారని, బహుశా అప్పుడే తనకు హెచ్ఐవీ సోకి ఉంటుందని వివరించాడు. సరస్వతి వైద్య తనకు కూతురు లాంటిదని అన్నాడు. వారిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచారని తెలిసింది. సానె తనకు మామా అని వైద్య చెప్పేది.
వైద్య చాలా పొస్సెస్సివ్ అని, తాను పని నుంచి లేట్‌గా ఇంటికి వచ్చినప్పుడు తనను అనుమానించేదని సానె తెలిపాడు. వైద్య పదో తరగతి పరీక్షలు రాయాలని అనుకుంది. ఆమెకు సానె మ్యాథ్స్ బోధిస్తున్నాడు. ఇంటిలో బ్లాక్ బోర్డు పై కొన్ని మ్యాథ్స్ ఈక్వేషన్లు ఉన్నాయి.
ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్న సానె మంచి ఉద్యోగం దొరకనందున 10 ఏళ్లుగా రేషన్ షాపులోనే పని చేశాడు.
Also Read: సీఎం కుర్చీ నీకు సిద్ధూ ఇచ్చిన బహుమానం: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై సిద్దూ భార్య అటాక్
జూన్ 3వ తేదీన ఇంటిలో ఉదయంపూట సరస్వతి వైద్య మరణించి కనిపించందని సానె చెబుతున్నాడు. ఆమె పల్స్ చెక్ చేయగా మరణించినట్టు గ్రహించాడని వివరించాడు. తనపై యాక్షన్ తీసుకుంటారనే భయంతో ఆమె బాడీని మాయం చేయాలని అనుకున్నాడని సానె పోలీసులకు చెప్పాడు.
ఎలక్ట్రిక్ కట్టర్‌తో ఆమె బాడీని ముక్కలుగా కోశఆడు. కొన్నింటిని ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాడు. వాటిని గ్యాస్ పై రోస్ట్ చేశాడు. తద్వార వాటిని సులువుగా బయట పడేయవచ్చని భావించాడు. గురువారం పోలీసులు ఆ ఇంటిలోకి తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లగా కిచెన్‌లో రెండు బకెట్ల నిండ నెత్తురు కనిపించింది. అందులో కొన్ని చిన్న చిన్న బాడీ పార్టులు కనిపించాయి.
మనోజ్ సానెకు సరస్వతి వైద్యకు 2014లో ఓ రేషన్ షాపులో పరిచయమైంది. 2015లో వారిద్దరూ కలిసి మీరా రోడ్‌లోని గీతా నగర్ ఏరియాలో గీతా ఆకాశ్ దీప్ జీ వింగ్‌లో ఉన్నారు. 2015లో జే వింగ్‌లోని ఏడో అంతస్తులో 704కు మారారు. 2023 జూన్ 4న సరస్వతి వైద్యను మనోజ్ సానె హత్య చేశాడు. జూన్ 3వ తేదీనే సరస్వతి వైద్య ఆత్మహత్య చేసుకున్నదని సానె చెబుతున్నాడు. జూన్ 5వ తేదీన వైద్య డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేసి పలు చోట్ల పడేశాడు. జూన్ 7న అపార్ట్‌మెంట్ వాసుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. జూన్ 8న ఆయనను జూన్ 16వ తేదీ వరకు రిమాండ్‌కు పంపారు.