Asianet News TeluguAsianet News Telugu

ఉద్ధవ్ థాక్రే భార్యపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అంతుచూస్తామంటూ ముంబై మేయ‌ర్

Mumbai: బీజేపీ ఐటీ సెల్‌కు చెందిన జితిన్‌ గజారియా (Jiten Gajaria) అనే వ్యక్తి జనవరి 4న "మరాఠీ రబ్రీ దేవి" (Marathi Rabri Devi) అంటూ సీఎం ఉద్ద‌వ్ థాక్రే  భార్య‌ను ర‌ష్మీ థాక్రేపై చేసిన వ్యాఖ్య‌లు బీజేపీ-శివ‌సేన‌ల మ‌ధ్య వివాదాన్ని మ‌రింత‌గా ముదిరేలా చేసింది. దీనిపై స్పందించిన ముంబ‌యి మేయ‌ర్  కిశోరి పెడ్నేకర్  తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. 
 

Mumbai Mayor Slams BJP Leader For Remark Against Uddhav Thackeray's Wife
Author
Hyderabad, First Published Jan 7, 2022, 1:22 PM IST

Mumbai: మహారాష్ట్ర (Maharashtra ) ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సతీమణి రష్మీ థాక్రేపై (Rashmi Thackeray) వివాదాస్పద ట్వీట్ చేసినందుకు ఆ రాష్ట్ర బీజేపీ (bjp) సోషల్ మీడియా సెల్ సభ్యుడిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ (Mumbai Police Crime Branch) అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ట్వీట్ నేప‌థ్యంలో శివ‌సేన శ్రేణులు బీజేపీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. బీజేపీ ఐటీ సెల్‌కు చెందిన జితిన్‌ గజారియా (Jiten Gajaria) అనే వ్యక్తి జనవరి 4న "మరాఠీ రబ్రీ దేవి" (Marathi Rabri Devi) అంటూ సీఎం ఉద్ద‌వ్ థాక్రే  భార్య‌ను ర‌ష్మీ థాక్రేపై చేసిన వ్యాఖ్య‌లు బీజేపీ-శివ‌సేన‌ల మ‌ధ్య వివాదాన్ని మ‌రింత‌గా ముదిరేలా చేసింది. దీనిపై స్పందించిన ముంబ‌యి మేయ‌ర్  కిశోరీ పెడ్నేకర్  తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ స్థాయిలో ఎదగడానికి శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ థాకరే ఎంతో కృషి చేశార‌నీ, అలాంటి వ్యక్తి కోడలిని కించపరుస్తూ ఎలా మాట్లాడతారని ఆమె బీజేపీని నిల‌దీశారు. పార్టీలు మారే గజారియా మహారాష్ట్ర మహిళపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని  అన్నారు. 

 'జితిన్ గజారియా ఎవరు? ఎన్సీపీ నుంచి బీజేపీలోకి కంగారూ మాదరి దూకిన వ్యక్తి. ఈరోజు ఆయన మహారాష్ట్ర మహిళ అయిన రష్మి గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. బాలాసాహెబ్ థాకరే కోడలు, ఉద్ధవ్ థాకరే భార్య, ఆదిత్య థాకరే తల్లి అయిన మహారాష్ట్ర మహిళ రష్మిని లాగాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజకీయాల్లో బీజేపీ ఎదగడానికి బాలాసాహెబ్ థాకరే ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తి కోడలిపైనే ఇప్పుడు బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్ల బీజేపీకి గౌరవం ఎలా వస్తుంది? శివసేనకు చెందిన మహిళా అఘాడీ ముందుకు గజారియా వస్తే... ఆయన సంగతి చూస్తాం' అని కిశోరీ పెడ్నేకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సతీమణి రష్మీ థాక్రేపై (Rashmi Thackeray) వివాదాస్పద ట్వీట్ చేసినందుకు ఆ రాష్ట్ర బీజేపీ (bjp) సోషల్ మీడియా సెల్ సభ్యుడిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ (Mumbai Police Crime Branch) గురువారం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. బీజేపీకి చెందిన  జితేన్ గజారియా (Jiten Gajaria) అనే వ్యక్తి జనవరి 4న "మరాఠీ రబ్రీ దేవి" (Marathi Rabri Devi) అనే క్యాప్షన్‌తో రష్మీ థాక్రే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాణా కుంభకోణంపై ఆమె భర్త లాలూ ప్రసాద్‌ (Lalu Prasad) బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు బీహార్‌లో రబ్రీ దేవి (Rabri Devi)బాధ్యతలు స్వీకరించినట్లే తన భార్య తన పదవిని చేపడతారని సూచిస్తూ సీఎం ఆరోగ్య సమస్యలను ఉద్దేశిస్తూ.. జితేన్ ఈ క్యాప్షన్ పెట్టాడు. మరోవైపు జితేన్ అరెస్ట్‌పై అతని తరపు న్యాయవాది, బిజెపి కార్యదర్శి వివేకానంద్ గుప్తా మాట్లాడుతూ, “సైబర్ పోలీసులు కారణం, ఫిర్యాదు చేసినవారు ఎవరో చెప్పకుండానే పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని అతనికి నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని ఆయన తెలిపారు. అయితే, ప్ర‌స్తుతం ఈ పోస్టు బీజేపీ, శివ‌సేన‌ల మ‌ధ్య వార్ ను మరింతగా పెంచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios