ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్‌ను చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడంతో నగరం ఉలిక్కిపడింది. దీనిపై ఆమె ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గతేడాది డిసెంబర్ 22న ఒక గుర్తుతెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదరించాడని, ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అగంతకుడు హిందీలో ఫోన్ చేసినట్టు గుర్తించిన అధికారులు అతని కోసం ఒక బృందాన్ని పొరుగు రాష్ట్రానికి పంపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసు అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

2020లో బీఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండటం, అధికారాన్ని చేజిక్కించుకోడం కోసం రాజకీయ పార్టీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం రాజుకుంది. ఇలాంటి పరిస్ధితుల్లో కిషోరి పడ్నేకర్‌కు బెదరింపు కాల్స్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, రాజకీయాల్లోకి రాకముందు నర్సుగా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్య సిబ్బందిలో స్ఫూర్తి నింపేందుకు గాను గతేడాది ఏప్రిల్‌లో నర్సుగా యూనిఫాం వేసుకున్నారు. ముంబై మేయర్ కాక ముందు కిషోరి పడ్నేకర్ ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 2 గంటల వరకు పని చేసేవారు.