ముంబై: ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు ఓ వ్యక్తి తన భార్యకు కరోనా ఉందని చెప్పి వెళ్లిపోయాడు. లవర్ తో ఎంజాయ్ చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొన్నారు.  ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ముంబైలోని తలోజాకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి పెళ్లై భార్య ఉంది. కానీ ఆయన మరో యువతిని ప్రేమించాడు.  భార్యతో సంబంధాలను తెంచుకొని లవర్ తో ఉండాలనుకొన్నాడు.

దీంతో ఆయన ఓ పథకాన్న రచించాడు. ఈ పథకాన్ని అమలు చేశాడు. తనకు కరోనా వచ్చిందని... త్వరలోనే చనిపోతానని ఆయన కొన్నిరోజుల క్రితం భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే తన ఫోన్ ను సిచ్ఛాప్ చేశాడు.

దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు ఫోన్ చేసిన సమయంలో భర్త సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఓ కొలను వద్ద అతని బైక్, ఇతర వస్తువులను గుర్తించారు.

అతను సరస్సులో మునిగి చనిపోయాడని భావించారు. సరస్సులో గజ ఈతగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది.  అయితే ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ఈ సీసీటీవీ దృశ్యాల్లో అతడు కన్పించాడు.

ఓ కారులో మహిళతో కలిసి అతను వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇండోర్ లోని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న అతడిని పోలీసులు ముంబైకి తీసుకొచ్చారు.