ఓ వ్యక్తి తాను వాహనం నడుపుతూ, ఆ బండిపై ఏడుగురు చిన్నారులను ఎక్కించుకున్నాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా, సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఒక ద్విచక్రవాహనంపై ఎంత మంది ప్రయాణిస్తారు..? ఇద్దరు ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. మహా అయితే, అవసరాన్ని బట్టి ముగ్గురు ప్రయాణించవచ్చు. నిజానికి, ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించడాన్ని కూడా అనుమతించరు. అలాంటిది ఓ వ్యక్తి తాను వాహనం నడుపుతూ, ఆ బండిపై ఏడుగురు చిన్నారులను ఎక్కించుకున్నాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా, సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబయికి చెందిన మున్వర్ షా(39) కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉాంటాడు. కాగా, అతను తాజాగా ఏడుగురు మైనర్ పిల్లలను బండిపై ఎక్కంచుకొని నగరంలో షికారు చేశాడు. పిల్లలు కూర్చోవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది. కేవలం ఒక్క కాలితో కూడా వారు నిల్చోవడం విశేషం. ఆ బండి మీద ఉన్న పిల్లలు అందరూ 6 నుంచి 14ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. కొంచెం అదుపుతప్పినా ఎవరో ఒకరు కిందపడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అలాంటిది కొంచెం కూడా అజాగ్రత్త లేకుండా అతను ఎలా డ్రైవ్ చేశాడని అందరూ విమర్శించడం గమనార్హం.
దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వీడియో వైరల్ గా మారింది. వీడియో వైరల్ గా కూడా మారింది. అందులో చిన్నారులు కనీసం యూనిఫాం కూడా ధరించి కనిపిస్తున్నారు. అంటే, వారు స్కూల్ లేదా ట్యూషన్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. బ్యాగులు కూడా పట్టుకొని ఉన్నారు. అయితే, వారు సరదాగా బండి పై తిరిగినట్లు తెలుస్తోంది. వీడియోని ఆధారంగా తీసుకున్న ముంబయి పోలీసులు.. బండి నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, అతని బండిని సైతం సీజ్ చేశారు.
