సొంత బంధువులే అతనిపై పగ పెంచుకున్నారు.  కష్ట కాలంలో రక్షణగా నిలవాల్సింది పోయి.. అతి దారుణంగా హత్య చేశారు.  ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. కాగా... అతని చావు కారణమంటూ సదరు వ్యక్తి మామ, మరో ముగ్గురు ఇతర కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు.. శనివారం రాత్రి బాధితుడితో గొడవపడినట్లు సమాచారం. తర్వాత ఆదివారం కూడా.. వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. సొంత అల్లుడు అనే భావన కూడా లేకుండా అతి దారుణంగా సదరు వ్యక్తిని కొట్టారు.  ఆ దెబ్బలు తట్టుకోలేక.. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా..వీరికి గతంలోనూ విభేదాలుు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

చనిపోయిన వ్యక్తికి ప్రధాన నిందితుడు స్వయానా పిల్లనిచ్చిన మామ కాగా.. మిగితా ముగ్గురు బావ మరదులుగా గుర్తించారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు  పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు వారి మధ్య ఏ విషయంలో విభేదాలు వచ్చాయి అనే విషయం తెలియాల్సి ఉంది.