Asianet News TeluguAsianet News Telugu

భార్య కోసం బిడ్డ మెడకు ఉరి బిగించాడు

తనతో విడివడి వేరుగా ఉంటున్న భార్యను తిరిగి రప్పించుకోవడానికి కన్న కొడుకు, కూతురులు
మరణించినట్టుగా చిత్రించాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ క్రమంలో కూతురిని దాదాపు
చంపేసినంత పనిచేశాడు. ఆ ఫొటోలు చూపిస్తే భార్య భయపడి తన దగ్గరకు తిరిగి వస్తుందని
భావించినట్టు పోలీసులకు తెలిపాడు.

mumbai man hatched conspiracy to get back his wife using childrens
Author
Mumbai, First Published Aug 10, 2021, 4:16 PM IST

ముంబయి: కన్న కొడుకుపై బతికి ఉండగానే తెల్లటి వస్త్రం కప్పి పూల దండలు వేసి దాదాపు అంతిమ క్రియలకు రెడీగా ఉన్నట్టు సిద్ధం చేశాడు. కూతురిని బకెట్‌పై నిలబెట్టి ఫ్యాన్‌కు కట్టిన తాడుతో ఉరి బిగించాడు. బిడ్డ వారిస్తే ఫ్యాన్ స్విచ్ వేసి ఉచ్చు బిగించి చంపేస్తాననీ బెదిరించాడు. పిల్లల అరుపులతో స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి వారిని కాపాడారు. పోలీసుల విచారణలో మాత్రం ఇదంతా తనతో వేరుగా ఉంటున్న భార్యను తిరిగి రప్పించుకోవడానికి చేశానని చెప్పాడు. పిల్లలు చనిపోయినట్టున్న ఫొటోలు తీసి ఆమెకు పంపితే భయంతో వెంటనే తిరిగి వస్తుందని భావించానని వివరించాడు. ఈ ఘటన ముంబయిలో మలాడ్ ఈస్ట్‌లోని కురార్ గ్రామంలో జరిగింది.

తనతో విడివడి దూరంగా ఉంటున్న భార్యను రప్పించడానికి ఇదంతా చేశాడని నిందితుడు ఒప్పుకున్నట్టు పోలీసు అధికారి ప్రకాశ్ బేలె తెలిపారు. ఎనిమిదేళ్ల కొడుకుపై తెల్ల వస్త్రం పరిచి అంతిమ క్రియలకు సిద్ధంగా ఉన్నట్టు చిత్రించాడు. 13ఏళ్ల కూతురును ఓ బకెట్‌పై నిలబెట్టి సీలింగ్ ఫ్యాన్‌కు కట్టిన తాడును మెడకు బిగించాడు. బకెట్‌పై నుంచి దూకేయాలని ఆదేశించాడు. దయచేసి తనన  వదిలిపెట్టాలని బిడ్డ ప్రాధేయపడినా విడిచిపెట్టలేనట్టు తెలిసింది. 

బకెట్ పై నుంచి దూకేయకుంటే ఫ్యాన్ స్విచ్ వేసి ఉచ్చు బిగిసేలా చేస్తానని బెదిరించాడు. ఆమె భయంతో అరవడంతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. పిల్లలను కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో చిన్నారులను ప్రొటెక్టివ్ కస్టడీలోకి తీసుకున్నారు. పిల్లలు చనిపోయినట్టు ఫొటోలు తీసుకుని తన భార్యకు పంపాలనుకున్నాడని, తద్వారా ఆమె భయపడి తన దగ్గరకు వస్తుందని ఆలోచించినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు నిందితుడిపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండేళ్ల క్రితమే నిందితుడిని భార్య వదిలేసింది. పిల్లలను తీసుకుని ఆమె తన తల్లి దగ్గరకు పరారైంది. గతనెలలోనే నిందితుడు భార్య దగ్గర నుంచి పిల్లలను వెనక్కి తెచ్చుకోగలిగాడు. కానీ, ఆమె తిరిగిరావడానికి నిరాకరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios