ప్రేమగా ప్రియురాలిని ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ ఏదో చిన్న విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. అంతే యువకుడు కోపంతో ఊగిపోయాడు. కత్తితో యువతిని దారుణంగా పలుమార్లు పొడిచాడు. అనంతరం పదో అంతస్తు భవనం ఎక్కి బాల్కనీలో నుంచి కిందకు దూకేశాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయికి చెందిన మంగేష్ రానే(24) అనే యువకుడి ఇంటికి అతని 17ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఇద్దరూ సరదాగా ఉన్న సమయంలో ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్త మాటా మాటా పెరిగి పెద్దదిగా మారింది. అంతే యువకుడు కోపంతో తన ప్రియురాలిని కత్తితో దారుణంగా పొడిచేశాడు.

అనంతరం తన పదో అంతస్తు ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత యువతి ఆస్పత్రిలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.