ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలియజేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లోకల్ ట్రైన్స్ కూడా పరుగులు పెట్టనున్నాయి. అయితే.. ఇది కేవలం మహారాష్ట్రలో మాత్రమే కావడం గమనార్హం. ముంబయి ప్రజల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది.

మ‌హాన‌గ‌ర ప్ర‌జ‌ల‌కు జీవ‌నాధార‌మైన లోకల్ రైళ్ల‌లో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో కొవిడ్ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కూ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన కాసేప‌టికే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

గ‌తేడాది మార్చిలో క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ లోక‌ల్ రైళ్ల‌ను ద‌శ‌ల‌వారీగా పున‌రుద్ధ‌రిస్తున్నారు. అయితే ఫిబ్ర‌వ‌రి 1 నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అనుమ‌తించినా.. దానికి ప్ర‌త్యేక స‌మ‌యాల‌ను కేటాయించారు. ఉద‌యం 7 గంట‌ల లోపు, మ‌ధ్యాహ్నం 12 నుంచి 4 వ‌ర‌కు, రాత్రి 9 గంట‌ల త‌ర్వాతే ప్ర‌జ‌ల‌ను ఈ రైళ్ల‌లో అనుమ‌తించ‌నున్నారు.