వీధి కుక్కలను తిండి పెట్టినందుకు ఓ వ్యక్తికి రూ.3.60లక్షల జిరిమానా విధించారు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయికి చెందిన ఓ నేహా దత్వాని అనే వ్యక్తి నిసర్గ్ హెవెన్ సొసైటీలో నివాసం ఉంటున్నాడు. అతను ఓ కంపెనీలో అడ్వర్టైజింగ్ ఎక్సిక్యూటివ్ గా ఉద్యోగం చేసుకున్నాడు.  మొదటి నుంచి అతను జంతు ప్రేమికుడు. దీంతో.. ఇటీవల అతను తాను నివసించే హౌసింగ్ సొసైటీ పరిసరాల్లో వీధికుక్కలకు ఆహారం పెట్టాడు.

దీంతో.. అది గమనించిన ఆ హౌసింగ్ సొసైటీలో నివసించే కొందరు సొసైటీ ఛైర్మన్ కి ఫిర్యాదు చేశారు. అతనికి జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. దీంతో.. వారి ఫిర్యాదు మేరకు అతనికి రూ.3.60లక్షల జరిమానా విధించారు.

దీనిపై హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ మితేష్ బోరా మాట్లాడుతూ.. తమ హౌసింగ్ సొసైటీలో నివసించే దాదాపుప 98శాతం మంది ఫిర్యాదు చేశారు. అందుకే తాను చర్యలు తీసుకోక తప్పలేదని చెప్పారు. హౌసింగ్ సొసైటీ బయట కుక్కలకు ఆహారం పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తమకు కుక్కలంటే ఇష్టమేనని చెప్పారు.

అయితే.. ఆ వీధి కుక్కలను సొసైటీలోకి తీసుకువచ్చి ఆహారం పెట్టడం వల్ల రోజూ వాటికి అలవాటుగా మారుతుందని.. అవి సీనియర్ సిటిజన్స్, పిల్లలపై దాడులు చేసే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. 

బాధితుడు నేహా దత్వాని మాట్లాడుతూ.. కుక్కలకు ఆహారం పెట్టినందుకు తనకు రోజుకి రూ.2,500 చొప్పున రూ.3.60లక్షలు జరిమానా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవి వీధి కుక్కలు కాదని.. తమ హౌసింగ్ సొసైటీలోనే అవి పుట్టాయని తెలిపారు. అవి పుట్టినప్పటి నుంచి వాటి జాగ్రత్తలు తాను తీసుకుంటానని కూడా వివరించారు.