Mumbai: దక్షిణ ముంబైలో ఓ అపార్ట్ మెంట్ లోని 11వ అంతస్తు నుంచి ఐదేళ్ల పిల్ల‌వాడు కింద‌ప‌డి మృతి చెందాడు. చిన్నారి తన ఫ్లాట్‌లోని  గొడుగు పట్టుకుని ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

Mumbai: దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటు చేసింది. దక్షిణ ముంబైలో ఓ అపార్ట్ మెంట్ లోని 11వ అంతస్తు నుంచి ఐదేళ్ల పిల్ల‌వాడు కింద‌ప‌డి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన దక్షిణ ముంబైలోని బైకుల్లా ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో జరిగింది. ఓ పిల్ల‌వాడు తన ఫ్లాట్‌లోని గొడుగు పట్టుకుని ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఆ బాలుడు తమ‌ ఫ్లాట్ కి ఉన్న ఓపెన్ విండో దగ్గర గొడుగుతో ఆడుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ బాలుడు ప‌క్క‌నే ఉన్న మంచం మీద ఎక్కి కిటికీలో నుండి బయటకు తొంగి చూసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదాశాత్తువు.. ఆ బాలుడు కిటీకిలో నుంచి కింద పడిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆ బాలుడికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాద‌ సమయంలో ఆ చిన్నారి తల్లి, ఇతర బంధువులు కూడా అదే గదిలో ఉండ‌టం గ‌మానార్హం.

స్థానికులు వెంట‌నే ముంబై సెంట్రల్ సమీపంలోని సివిక్-రన్ నాయర్ ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు చేర్చేలోపే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు. 

పిల్లలతో జాగ్ర‌త్త‌..

అపార్ట్మెంట్ లో ఉంటే.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు 

>> మీ బాల్కనీ, రెయిలింగ్‌లను నిత్యం తనిఖీ చేయండి.

>> కిటికీలు, బాల్కనీలలో సేఫ్టీ గ్రిల్స్‌ను అమర్చండి.

>> కుర్చీలు, బల్లలు, ఇతర ఫర్నిచర్‌లను బాల్కనీ, రెయిలింగ్‌లకు దూరంగా ఉంచండి.

>> మీరు బయటకు వెళ్లినప్పుడు బాల్కనీ తలుపును లాక్ చేసి ఉంచండి.

>> భద్రత గురించి మీ పిల్లలకు అవగాహన కల్పించండి.