హైదరాబాద్‌లో దిశపై జరిగిన దారుణంపై ప్రజలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను ఉరితీయాలంటూ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కేసును వేగంగా విచారించేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును కూడా ఏర్పాటు చేశారు.

దేశంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా జైపూర్‌లో ఓ యువతిపై తోటి ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read:మాటలతో చంపేస్తున్నారు : చనిపోవడానికి అనుమతించండి.. గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి ఆవేదన

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 19 ఏళ్ల యువతి జైపూర్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఓ క్లబ్‌లో స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీకి వెళ్లింది.

పార్టీ ముగిసిన అనంతరం అక్షయ్ అనే ఆమె సహోద్యోగి ఆమెను దగ్గర్లోని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు జైపూర్‌లోని ఖో నాగోరియన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. 

దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో కీలక ఆధారమైన సెల్‌ఫోన్‌ను సిట్ బృందం స్వాధీనం చేసుకొంది. దిశ సెల్‌ఫోన్ ను నిందితులు పాతి పెట్టినట్టుగా సిట్ బృందం విచారణలో ఒప్పుకొన్నారు.

నవంబర్ 27వ తేదీన దిశను నిందితులు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. నిందితులను  సిట్ బృందం  ఈ నెల 4వ తేదీన  రాత్రి తమ కస్టడీలోకి తీసుకొంది. ఈ హత్య కేసు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్టుగా సమాచారం.

Also read:కదులుతున్న కారులో విద్యార్ధినిపై నలుగురు గ్యాంగ్‌రేప్: కారుకు పోలీస్ లోగో

ఈ హత్య పట్ట దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో నిందితులతో పగటిపూట సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తే ఇబ్బందులు వస్తాయనే కారణంగా పోలీసులు నిందితులను రాత్రి పూటే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తోంది