గుర్తుతెలియని వ్యక్తులు ఐదేళ్ల చిన్నారిని గోనెసంచిలో కుక్కి.. రోడ్డుపై పడేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రేణు అనే పాపను గోనె సంచిలో కుక్కి, వాసాయ్ లోని పాథర్ వాడి పెట్రోల్ పంప్ సమీపంలోని రోడ్డుపై పడేశారు. 

ఆదివారం ఉదయం 6గంటల ప్రాంతంలో అప్పటివరకు మత్తులో ఉన్న పాపకు స్పృహ వచ్చింది. గోనె సంచిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. కాగా.. రోడ్డుపై వెళుతున్న జనం గోనె సంచి కదలడాన్ని గమనించిన స్థానికులు విప్పి చూశారు. కాగా.. అందులో చిన్నారి ఉండటం చూసి షాకయ్యారు.

దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పాపను వివరాలు అడగ్గా.. తన పేరు రేణు అని, తల్లిదండ్రుల పేర్లు గోపాల్‌, గాయత్రి అని చెప్పింది. ఇంటి అడ్రస్‌ చెప్పలేకపోయింది. పోలీసులు రేణును దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాప తల్లిదండ్రుల కోసం విచారణ చేపట్టారు.