ముంబై: ముంబై ఎంటిఎన్‌ఎల్ కార్యాలయంలో సోమవారం నాడు  అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. నాలుగు అంతస్తుల భవనంలో  ఈ ప్రమాదం వాటిల్లింది. దీంతో  ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి.

 సోమవారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను  ఆర్పతున్నారు.నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మొదటి అంతస్తులో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.

 

ఇటీవల కాలంలో ముంబైలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత వారంలో తాజ్ మహల్ హోటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.2017 డిసెంబర్ మాసంలో  జరిగిన  అగ్ని ప్రమాదంలో సుమారు  14 మంది  మృత్యువాత పడ్డారు.