ముంబైలోని తిలక్ నగర్‌లో ఉన్న 13 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పలువురు ఆ మంటల్లో చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది
దేశ ఆర్థిక రాజధాని, మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ముంబైలోని తిలక్ నగర్‌లో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి, చాలా మంది నివాసితులు బాల్కనీలో వేలాడుతూ.. తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో తమని కాపాడమని అక్కడి వారిని వేడుకున్నారు. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది
వివరాల్లోకెళ్తే.. చెంబూర్‌లోని న్యూ తిలక్ నగర్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి, ఈ కారణంగా ఈ భవనంలో నివసిస్తున్న చాలా మంది భవనంలో చిక్కుకున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. .
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబై అగ్నిమాపక దళం (MFB) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2:43 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందిందని తెలిపారు.
మంటలు చెలరేగడంతో భవనంలో ఉన్న నివాసితులు సురక్షితంగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరూ నివాసితులు బాల్కనీలో వేలాడుతూ.. తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో తమని కాపాడమని అధికారులను వేడుకున్నారు. భవనం విజువల్స్ చూస్తే.. చాలా మంది చేతులు ఊపుతూ రక్షించాలంటూ వేడుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది.
