Asianet News TeluguAsianet News Telugu

ఆత్మ పిలుస్తోందంటూ యువకుడు ఆత్మహత్య

ఆత్మలు ఉన్నాయా...ఉంటే అవి ఎలా ఉంటాయి... మనిషి ప్రాణాలను కోరుతుంటాయా...ఇవి ప్రతీ ఒక్కరి మదిని తట్టే ప్రశ్నలు. ఆత్మలు ఉన్నాయో లేదో అన్న అంశంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. దేవుడు ఉన్నాడు అంటే ఆత్మ ఉంటుందని కొందరు వాదిస్తుంటారు....అయితే ఎలాంటి ఆధారాలు లేవు. 
 

mumbai engineering student commits suicide due to soul calling him
Author
Mumbai, First Published Oct 16, 2018, 5:10 PM IST

ముంబై : ఆత్మలు ఉన్నాయా...ఉంటే అవి ఎలా ఉంటాయి... మనిషి ప్రాణాలను కోరుతుంటాయా...ఇవి ప్రతీ ఒక్కరి మదిని తట్టే ప్రశ్నలు. ఆత్మలు ఉన్నాయో లేదో అన్న అంశంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. దేవుడు ఉన్నాడు అంటే ఆత్మ ఉంటుందని కొందరు వాదిస్తుంటారు....అయితే ఎలాంటి ఆధారాలు లేవు. 

ఆత్మలు ఉన్నాయో లేవో అన్న విషయం పక్కన పెడితే ఆత్మ పిలుస్తోందంటూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం మాత్రం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. ఆత్మ పిలుస్తోందంటూ 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వివరాల్లోకి వెళ్తే నాగ్‌పూర్‌కు చెందిన సౌరభ్‌(18) ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా సౌరభ్ ఒక రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ ప్రమాదంలో తన కళ్లెదుటే ఓ బాలుడు చనిపోయాడు. తన కళ్లెదుటే ఓ బాలుడు చనిపోవడం చూసి తల్లడిల్లిపోయిన సౌరభ్ ఆ రోజు నుంచి ఆ బాలుని ఆత్మ తనకు కనిపిస్తుందని.. అది తనను రమ్మని పిలుస్తుందని చెప్పడం ప్రారంభించాడు. ఆత్మ పిలుస్తోందంటూ ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. అయితే సౌరభ్‌ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు.

 సౌరభ్ చూసిన రోడ్డు ప్రమాదంలోనే మరో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మైనర్లు చనిపోయారు. ఆ మరణాలకు బాలుడి ఆత్మే కారణమని సౌరభ్ భావించాడు.   బాలుడి ఆత్మ తనను పిలుస్తున్నా వెళ్లకపోవడం వల్లే ఇద్దరు మైనర్లను బలితీసుకుందని భావించాడు. తాను చనిపోతే బాలుడి ఆత్మ శాంతిస్తుందని లేకపోతే మరింత మందిని బలితీసుకుంటుందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

సౌరభ్ ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సౌరభ్ మృతదేహం వద్ద సూసైట్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం నా కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. అతని ఆత్మ నన్ను పిలుస్తోంది. నేను రాకపోవడంతో ఇద్దరు చనిపోయారు. నేను వెళ్లకపోతే మరింత మంది చనిపోతారు. అందుకే నేను చనిపోతున్నానంటూ సౌరభ్‌ సూసైడ్‌ నోట్‌లో రాశాడని పోలీసులు తెలిపారు.

సౌరభ్‌ చాలా తెలివిగల విద్యార్థి అని చదువులో ఎప్పుడు ముందుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందే ఓ వ్యక్తి చని పోవడం అతన్ని ఎంతో బాధించిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం విషయం ఇంట్లో వారికి చెప్పినా వారు లైట్ తీసుకున్నారని చెప్పారు. బాలుని ఆత్మ పిలుస్తుందనే భయం వల్లే సౌరభ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్‌ అధికారులు నిర్ధారించారు. 

ఇలాంటి ఆత్మవ్యవహారం ఇటీవలే నల్గొండ జిల్లా మిర్యాలలో చోటు చేసుకుంది. మిర్యాల గూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ ఆత్మ తమకు కనిపిస్తోంది, విగ్రహం కట్టమని అడుగుతుందంటూ ఓ జంట ప్రణయ్ భార్య అమృతను కలిశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios