మహారాష్ట్రలోని వసాయ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో బ్యాటరీ పేలడం వల్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న.. భయం అవుతుంది. ఎక్కడో ఓ చోట ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలుతూనే ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పేలి మనుషులు కూడా చనిపోయారు. తాజాగా ముంబైలోని వసాయ్ (తూర్పు) సబర్బ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పేలిపోవడంతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిక్సిత పొందుతూ.. ఆ బాలుడు మరణించాడు.
వివరాల్లోకెళ్తే.. తూర్పు వసాయ్ ప్రాంతంలో రాందాస్ నగర్‌కు చెందిన షానవాజ్ అన్సారీ.. సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన ఎలక్ట్రిక్ బైక్ చార్జీంగ్ పెట్టాడు. కానీ.. మరిచిపోయి అలాగే పడుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి.. ఓ సారిగా పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో బాలుడి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో అన్సారీ తల్లి రుక్సాన్‌కు స్వల్ప గాయాలు కాగా, అన్సారీ కుమారుడు షబ్బీర్ కు దాదాపు 70 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా, ఆ చిన్నారి చికిత్స పొందుత శుక్రవారం రాత్రి మరణించాడు.
బ్యాటరీ ఎప్పటి నుంచి ఛార్జింగ్ అయిందో స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పగా, తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అది ప్లగ్ అయిందని బాలుడి కుటుంబం విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై మానిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సంపత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. “మేము ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసాము. ఇప్పటి వరకు కుటుంబం నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. స్కూటర్ 2021 మోడల్. విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు. బ్యాటరీ వేడెక్కడం వల్లే పగిలిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ అన్సారీ కుటుంబ సభ్యులు మాత్రం స్కూటర్ బ్యాటరీ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిందించారు.
