Asianet News TeluguAsianet News Telugu

ఐసీయూలో కరోనా రోగికి డాక్టర్ లైంగిక వేధింపులు

 అత‌డికి చికిత్స చేయాల్సింది పోయి వైద్యుడు లైంగిక వేధించడం మొదలుపెట్టారు. అసభ్యపదజాలంతో లైంగిక దాడికి దిగాడు. అసభ్యంగా తాకడం లాంటివి చేశాడు. కాగా...  దీంతో స‌ద‌రు పేషెంట్ అత‌డి

Mumbai doctor booked for sexual assault of coronavirus patient
Author
Hyderabad, First Published May 5, 2020, 8:04 AM IST

కరోనా సోకి బాధపడుతున్న రోగికి వైద్యం అందించి రక్షించాల్సిందిపోయి.. ఆ రోగిని లైంగికంగా వేధించాడో వైద్యుడు. ఈ దారుణ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.. సదరు డాక్టర్ ని విధుల నుంచి తొలగించి.. అతనిపై కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబై మెడిక‌ల్ కాలేజ్‌లో విద్య‌న‌భ్య‌సించిన ఓ యువ‌కుడు వోక్‌హార్డ్ హాస్పిట‌ల్‌లో ఏప్రిల్ 30న వైద్యుడిగా నియ‌మితుడ‌య్యాడు. ఆ త‌ర్వాతి రోజున ఓ కోవిడ్ పేషెంట్ ఆసుప‌త్రిలోని ఐసీయూలో జాయిన్ అయ్యాడు. 

ఈ క్ర‌మంలో అత‌డికి చికిత్స చేయాల్సింది పోయి వైద్యుడు లైంగిక వేధించడం మొదలుపెట్టారు. అసభ్యపదజాలంతో లైంగిక దాడికి దిగాడు. అసభ్యంగా తాకడం లాంటివి చేశాడు. కాగా...  దీంతో స‌ద‌రు పేషెంట్ అత‌డి చ‌ర్య‌ల‌ను ప్ర‌తిఘ‌టించి అక్క‌డ ఉన్న అలార‌మ్ బ‌ట‌న్‌ను నొక్క‌డంతో అప్ర‌మ‌త్త‌మైన మిగ‌తా సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నారు.

బాధితుడు తెలిపిన వివ‌రాల మేర‌కు ఆసుప‌త్రి యాజ‌మాన్యం పోలీసుల‌కు స‌మాచారం అందించింది. వెంట‌నే పోలీసులు ఆసుప‌త్రికి చేరుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడు క‌రోనా వైర‌స్ సోకిన రోగికి సమీపంగా వెళ్లినందున‌ వైర‌స్ సోకే అవ‌కాశాలు ఉండ‌వ‌చ్చ‌న్న అనుమానంతో అత‌డిని అరెస్ట్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డిని థానేలోని స్వ‌గృహంలో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. మ‌రోవైపు అత‌డిని విధుల నుంచి తొల‌గించిన‌ట్లు వోక్‌హార్డ్ ఆసుప‌త్రి యాజ‌మాన్యం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios