ముంబయి బీచ్ లో ఓ మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. మలాద్ అక్సా బాచ్ వద్ద గోనె సంచిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని బ్యాగులో ఉంచి అక్సా బీచ్ వద్ద పడేసినట్లు తెలుస్తోంది. 

కాగా.. ఆ సంచి నుంచి భరించలేనంత కంపు రావడంతో సందర్శకులు పోలీసుకుల సమాచారం అందించారు.  పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

కండివలి ఈస్ట్ ప్రాంతంలో ఓ మహిళ ఇటీవల అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. 30 ఏళ్ల వయసు ఉన్న మహిళ ఎలా మరణించిందో పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని ముంబై పోలీసులు చెప్పారు. గంలోనూ బీచ్ లలో దొరికిన మృతదేహాలు మిస్టరీగా మిగిలాయి. గతంలో అక్సా బీచ్ సమీపంలోని ధారావళి పొదల్లో ఓ యువకుడి మృతదేహం లభించింది. గత ఏడాది డిసెంబరులో మాహిం బీచ్ లో సూట్ కేసులో ఓ వ్యక్తి మృతదేహం లభించింది.