Asianet News TeluguAsianet News Telugu

బాబోయ్.. మాస్క్ జరిమానాల కింద రూ. 30 కోట్ల ఆదాయం..

దేశవ్యాప్తంగ కరోనా మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం మరోసారి కఠిన ఆంక్షలు విధించింది. 

mumbai BMC has collected rs. 305000000 from people not wearing maskes in maharashtra - bsb
Author
Hyderabad, First Published Feb 24, 2021, 1:52 PM IST

దేశవ్యాప్తంగ కరోనా మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం మరోసారి కఠిన ఆంక్షలు విధించింది. 

దీంట్లో భాగంగానే మాస్క్ ధరించని వారికి భారీ జరిమానా విధిస్తోంది. ఇలా విధించిన జరిమానా సొమ్ము ఒక్క రోజులోనే రూ. 29 లక్షలు వసూలు కావడం ప్రజల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ సొమ్ము మొత్తం బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లోనే వసూలు కావడం విశేషం. 

బహిరంగ ప్రదేశాల్లో మాస్క ధరించని 14, 600 మందినుంచి ఈ మొత్తం వసూలు చేసినట్లు బీఎంసీ వెల్లడించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 22,976 మంది నుంచి 45.95 లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ ప్రకటించింది. 

ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ కఠినమైన చర్యలు ప్రకటించారు. ఇలా చేసిన కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం వసూలు కావడం గమనార్హం. బీఎంసీ తాజా మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి 200 రూపాయల జరిమానా విధిస్తున్నారు. 

ఇక 2020లో ఏడాది మొత్తం మీద మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా రూ. 30,50,00,000 రూపాయలు వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది.  మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ముంబై పోలీస్,సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే వంటి వివిధ ఏజెన్సీలు మాస్క్ ధరించని వారి నుంచి వసూలు చేసిన జరిమానాల మొత్తానికి సంబంధించిన డాటాను బీఎంసీ విడుదల చేయడం ప్రారంభించింది. 

సబర్బన్ రైల్వే నెట్ వర్క్ ను నడుపుతున్న సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు ఇప్పటివరకు రూ. 91,800 రూపాయలు జరిమానాగా వసూలు చేశాయి. బీఎంసీ లెక్కల ప్రకారం ప్రతీరోజూ మాస్క్ ధరించని 13వేల మందినుంచి ఈ సంస్థ రోజుకు సగటున రూ. 25 లక్షలకు పైగా వసూలు చేస్తోంది. 

జరిమానా కట్టలేని వారితో వీధులు ఊడ్చడం వంటి పనులు చేపిస్తోంది. పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో పెట్టుకుని గత వారం, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తాజా ఆంక్షలు విధించారు. లాక్ డౌన్ విధించాలా, వద్దా అని నిర్ణయించడానికి వచ్చే ఎనిమిది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని ఠాక్రే తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios