దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. ఈ ఎయిర్‌పోర్ట్ పేరును మార్చనున్నట్లు సమాచారం.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. ఈ ఎయిర్‌పోర్ట్ పేరును మార్చనున్నట్లు సమాచారం. ముంబై విమానాశ్రయం పేరు మార్చాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తాజాగా దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయాన్ని మొదట్లో సహారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పిలిచేవారు.
అయితే 1999లో మహారాజా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చారు. ప్రజల కోరిక మేరకు తాజాగా ‘ ఛత్రపతి శివాజీ మహరాజ్’ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సురేశ్ ప్రభు మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
