ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ మస్కట్ నుంచి వస్తున్న ఓ భారతీయుడి అరెస్టు చేశారు. అతని నుంచి రూ.2 కోట్ల విలువైన 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు స్మగ్లర్లు కొత్త దారులను వెతుకుతుంటారు. బంగారాన్ని పొడి చేసి..పలు మిశ్రమాలతో పేస్టు చేసి తరలిస్తున్నారు. తాజాగా మస్కట్ నుంచి హైదరాబాద్‌కు పేస్టు రూపంలో బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చిన ఓ భారతీయుడు ముంబై విమానాశ్రయంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులకు చిక్కారు. అతని వద్ద నుంచి 4.2 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ .2.28 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఒమన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో ఒక ప్రయాణికుడు శుక్రవారం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. 4.2 కిలోల బంగారాన్ని జీన్స్, లోదుస్తులు , మోకాలి క్యాప్ లోపల జాగ్రత్తగా కుట్టిన జేబులో బంగారాన్ని దాచారు. ఈ మేరకు ముంబై కస్టమ్స్ సమాచారం ఇచ్చింది.అధికారులు తనిఖీ చేస్తుండగా అతడు పట్టుబడ్డాడు. ఆ పేస్టును స్వాధీనం చేసుకొని కాల్చగా అందులోంచి బంగారం లభ్యమైంది.
