దాగుడుమూతలు ఆడుతూ 16 ఏళ్ల బాలిక లిప్టులో ఇరుక్కుని మృత్యువాత పడింది. ఈ ఘటన ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో చోటు చేసుకుంది. రేష్మా ఖరవీ అనే బాలిక దీపావళి పండగ జరుపుకోవడానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బాలిక చనిపోయింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వివాదం చోటు చేసుకుంది. దాగుడుమూతలు ఆడుతూ 16 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. ఈ వివాద ఘటన ముంబైలోని మాన్‌ఖుర్డ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో శుక్రవారం జరిగింది. దాగుడుమూతలు ఆడుతూ లిఫ్టులో దాచుకుంది. బాధితురాలు లిఫ్ట్‌లోని కిటికీ లాంటి ఓపెనింగ్‌లోకి తలను చొప్పించడంతో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో లిఫ్ట్ కిందకు దిగడంతో బాలిక తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆ బాలిక అక్కడిక్కడే మృతి చెందింది.
వివరాల్లోకెళ్తే.. రేష్మా ఖరవి అనే బాధితురాలు దీపావళి పండుగను జరుపుకోవడానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బాలిక చనిపోయింది. రేష్మ తన స్నేహితులతో దాగుడు మూతలు ఆడుతోంది. ఈ సమయంలో లిఫ్ట్ లో ఎవరైనా దాక్కున్నారని గమనించేందుకు లిఫ్ట్ లో ఉన్న కిటీకి లాంటి నిర్మాణం నుంచి తలను పెట్టి చూసింది. ఈ సమయంలో లిప్ట్ కిందకు దిగడంతో బాలిక తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది.హౌసింగ్ సొసైటీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. \
ప్రమాదాలు జరగకుండా హౌసింగ్ సొసైటీ అధికారులు కిటికీకి అద్దాలు బిగించాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హౌసింగ్ సొసైటీ చైర్మన్, సెక్రటరీని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని మన్‌ఖుర్డ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్ కోలీ తెలిపారు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.. నెల క్రితం ముంబైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ ఇలాగా లిఫ్టు ప్రమాదానికి గురైంది. ఓ టీచర్ తన ఆఫీసు రూంకు వెళ్తున్న సమయంలో లిఫ్టులో ఇరుక్కుని చనిపోయింది.
