Asianet News TeluguAsianet News Telugu

UP Elections 2022: బీజేపీలో చేరిన ములాయం కోడలు.. అసలు ఎవరీ అపర్ణ యాదవ్..!

ములాయం సింగ్ యాదవ్  కోడలు అపర్ణా యాదవ్.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమక్షంలో బీజేపీలో  చేరనున్నారు. కాగా.. గత కొంతకాలంగా.. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

Mulayam Singh Yadav Daughter in law May Join in BJP
Author
Hyderabad, First Published Jan 19, 2022, 11:15 AM IST

ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే.. ప్రచారాలు మొదలుపెట్టాయి. కాగా... ఈ ఎన్నికల వేళ.. సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కి ఊహించని షాక్ తగిలింది. ఆయన సొంత కోడలు బీజేపీలోకి చేరడం గమనార్హం.ములాయం సింగ్ యాదవ్  కోడలు అపర్ణా యాదవ్.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమక్షంలో బీజేపీలో  చేరారు. కాగా.. గత కొంతకాలంగా.. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేస్తుండగా.. నేడు అధికారికంగా ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.

Mulayam Singh Yadav Daughter in law May Join in BJP

ములాయం రెండో భార్య సాధన యాదవ్  కొడుకు ప్రతీక్ భార్యే.. ఈ అపర్ణ యాదవ్.. అపర్ణ తండ్రి అరవింద్ సింగ్ బిష్త్ జర్నలిస్టు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో అపర్ణ తండ్రిని సమాచార కమిషనర్‌గా నియమించారు. అదే సమయంలో,  ఆమె  తల్లి అంబి బిష్త్ లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారి గా విధులు నిర్వహించారు. అపర్ణ లక్నోలోని లోరెటో కాన్వెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో పాఠశాల విద్యను అభ్యసించింది. అపర్ణ, ప్రతీక్ చదువుకునే రోజుల్లో కలుసుకున్నారు.  వారు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు.


2010లో అపర్ణ, ప్రతీక్‌ల నిశ్చితార్థం జరిగింది. దీని తరువాత, వారిద్దరూ డిసెంబర్ 2011 లో ములాయం సింగ్ యాదవ్ స్వగ్రామమైన సైఫాయ్‌లో వివాహం చేసుకున్నారు. అపర్ణ, ప్రతీక్‌లకు ప్రథమ అనే కుమార్తె కూడా ఉంది. అపర్ణ UKలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పాలిటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

కాగా..అపర్ణ 2017లో లక్నో కాంట్ నుంచి పోటీ చేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆమె  సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు.. బీజేపీ తీర్థం పుచ్చుకొని..  ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios