Asianet News TeluguAsianet News Telugu

లక్నో కోర్టులో కాల్పులు: ముక్తార్ అన్సారీ అనుచరుడు సంజీవ్ జీవా మృతి

లక్నో  కోర్టులో  ఇవాళ  సాయంత్రం  లాయర్ దుస్తుల్లో  వచ్చిన దుండగులు  కాల్పులకు దిగారు. ఈ ఘటనలో  సంజీవ్  జీవాను  కాల్చి చంపారు నిందితులు

Mukhtar Ansari's Aide Sanjeev Jiva Shot Dead In Shootout At Lucknow Court  lns
Author
First Published Jun 7, 2023, 4:56 PM IST

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని  లక్నోలో  బుధవారంనాడు  దారుణం చోటు  చేసుకుంది.  లక్నో కోర్టులోనే  లాయర్ దుస్తుల్లో వచ్చి  కాల్పులకు దిగారు డుండగులు.  ఈ ఘటనలో  సంజీవ్ జీవా  అనే  వ్యక్తి  మృతి చెందాడు. ముక్తార్ అన్సారీకి  సంజీవ్  అత్యంత  సన్నిహితుడిగా  పేరుంది. కోర్టులో  విచారణ జరుగుతున్న సమయంలో  లాయర్ దుస్తుల్లో  వచ్చిన  దుండగులు  కాల్పులకు దిగారు. ఈ ఘటనలో  ఓ పోలీసుతో  పాటు ఓ చిన్నారికి  గాయాలయ్యాయి.

బీజేపీ ఎమ్మెల్యే  బ్రహ్మదత్ ద్వివేది హత్య  కేసులో  సంజీవ్ జీవా నిందితుడిగా  ఉన్నాడు.   ఈ కేసులో  ముక్తార్  అన్సారీ  కూడా నిందితుడు.గా  ఉన్న విషయం తెలిసిందేకోర్టు ఆవరణలో  సంజీవ్ జీవాపై  కాల్పులకు దిగిన  తర్వాత  నిందితులు అక్కడి నుండి పారిపోయారు.  ఈ ఘటనలో  గాయపడిన  కానిస్టేబు్ ను లక్నో  సివిల్ ఆసుపత్రికి తరలించారు.
కోర్టులో  కాల్పుల ఘటనతో  లాయర్లు, కోర్టు సిబ్బంది భయాందోళనలకు  గురయ్యారు.  ఈ ఘటనపై  తమ భద్రతపై  ఆందోళనతో  లాయర్లు  ఆందోళనకు దిగారు.  

ఇదిలా ఉంటే  సంజీవ్ జీవాపై  దుండగులు  ఐదు రౌండ్ల వరకు  కాల్పులకు దిగినట్టుగా పోలీసులు చెప్పారు. లాయర్ దుస్తుల్లో  వచ్చిన నిందితుల్లో  ఒకరిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

 

కోర్టులో  కాల్పుల నేపథ్యంలో  సంఘటన స్థలానికి భారీగా  పోలీసులు చేరుకున్నారు.  కాంపౌండర్ గా  తన  ప్రయాణాన్ని  సంజీవ్ జీవా  ప్రారంభించారు.  ఆ తర్వాత  ఆయనకు  అండర్ వరల్డ్  కార్యక్రమాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. . ఈ క్రమంలో  అరెస్టై  2018  లో  జైలుకు  వెళ్లాడు.  2018  బాగ్ పత్  జైలులో  శిక్ష  అనుభవిస్తున్న సమయంలో  మున్నా భజరంగికి  కూడా  సంజీవ్  జీవా సన్నిహితుడుగా  ఉన్నాడని చెబుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios