Asianet News TeluguAsianet News Telugu

Reliance Mukesh Ambani: రిలయ‌న్స్ రోబోలు.. ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌లో ముఖేష్ భారీ పెట్టుబ‌డులు !

Reliance Mukesh Ambani: భార‌త అప‌ర‌కుబేరుడు, రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ త‌న వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ రోబోటిక్స్ స్టార్ట‌ప్ ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌లో మెజారిటీ వాటాను ద‌క్కించుకున్నారు. ఏకంగా 132 మిలియ‌న్ల డాల‌ర్ల‌తో మేజారిటీ వాటాను కొనుగోలు చేశారు. 
 

Mukesh Ambani's Big New Investment: $132 Million For Robot-Maker
Author
Hyderabad, First Published Jan 19, 2022, 12:33 AM IST

Reliance Mukesh Ambani: భార‌త అప‌ర‌కుబేరుడు, రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ త‌న వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వివిధ రంగాల్లో పెట్టుబ‌డుల‌తో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఇండియ‌న్ రోబోటిక్స్ స్టార్ట‌ప్ ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌లో మెజారిటీ వాటాను ద‌క్కించుకున్నారు. ఏకంగా 132 మిలియ‌న్ల డాల‌ర్ల‌తో మేజారిటీ వాటాను కొనుగోలు చేశారు. పెరుగుతున్న ఈ-కామ‌ర్స్ బిజినెస్‌.. ప‌లు కంపెనీల నుంచి వ‌స్తున్న పోటీని ఎదుర్కొవ‌డం వంటి చర్య‌ల్లో భాగంగానే ఈ పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే ఈ-కామ‌ర్స్ నుంచి నూత‌న త‌రం ఇంధ‌న రంగ వ‌ర‌కు విభిన్న రంగాల్లో రిలయ‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఈ-కామ‌ర్స్ గోదాములు, ఇంధ‌న ఉత్ప‌త్తిని స‌మ‌ర్ధ‌వంతంగా చేయ‌డంలో రోబోటిక్ టెక్నాల‌జీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుందని ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్ కూడా పెట్టుబ‌డులు పెట్టి.. మెజారిటీ వాటాను ద‌క్కించుకున్నారు.  ఇండియ‌న్ రోబోటిక్స్ స్టార్ట‌ప్ ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌లో రిల‌య‌న్స్ వాటా కొనుగోలుకు సంబంధించి ఆ సంస్థ సీఈవో-స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు సంగీత్ కుమార్  మంగ‌ళ‌వారం ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం భార‌త్ లో ఈ-కామ‌ర్స్ వ్యాపారం విస్త‌రిస్తున్న‌ది. ప్ర‌పంచంలోని ఈ-కామ‌ర్స్ బిజినెస్ కొన‌సాగిస్తున్న కంపెనీలు ఇక్క‌డ ప‌ట్టు నిలుపుకోవ‌డం కోసం పోటీ ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌త్‌లో ఈ-కామ‌ర్స్ మార్కెట్‌పై ప‌ట్టు సాధించేందుకు గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు పోటీగా రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్ర‌ణాళిక‌లు ర‌చించి ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగానే  టెక్నాల‌జీ రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని పారిశ్రామిక వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ-కామ‌ర్స్ రంగంలో పోటీని ఎదుర్కొవ‌డానికి  ఇప్ప‌టికే ఆన్‌లైన్ గ్రాస‌రీ బిజినెస్ జియోమార్ట్‌, ఫ్యాష‌న్ రిటైల‌ర్ అజియో, ఇంట‌ర్నెట్ ఫార్మసీ నెట్‌మెడ్స్‌తోపాటు రిల‌య‌న్స్‌లోని వివిధ భాగాల్లో డ‌జ‌న్ల కొద్దీ వేర్ హౌస్‌ల‌ (గోదాం) నిర్మాణం ఆడ్‌వెర్బ్ చేప‌ట్టింది. వీటిల్లో రోబోటిక్ క‌న్వేయ‌ర్లు, సెమీ ఆటోమేటెడ్ సిస్ట‌మ్స్‌, పిక్‌బై వాయిస్ సాఫ్ట్‌వేర్ ప్ర‌వేశ‌పెడుతుంది ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌. ఈ-కామ‌ర్స్ గోదాములు, ఇంధ‌న ఉత్ప‌త్తిని స‌మ‌ర్ధ‌వంతంగా చేయ‌డంలో రోబోటిక్ టెక్నాల‌జీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుందని ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్ కూడా పెట్టుబ‌డులు పెట్టి.. మెజారిటీ వాటాను ద‌క్కించుకున్నారు. 

ఇండియ‌న్ రోబోటిక్స్ స్టార్ట‌ప్ ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌ సీఈవో-స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు సంగీత్ కుమార్  మాట్లాడుతూ.. రిల‌య‌న్స్ త‌న డిజిట‌ల్ వేర్‌హౌస్‌ల‌న్నింటిలోనూ ఆటోమేష‌న్ అమ‌లు చేయ‌డానికి భారీ ప్ర‌ణాళిక‌లను క‌లిగి ఉంద‌ని అన్నారు. దీనికి అనుగుణంగా ముందుకు సాగుతున్న‌ద‌ని తెలిపారు. రాబోయే రెండు సంవ‌త్స‌రాల్లో వంద‌ల సంఖ్య‌లో వేర్‌హౌస్ కేంద్రాల‌ విస్త‌ర‌ణ‌కు రిల‌య‌న్స్  ప్ర‌ణాళిక‌లు రూపొందించింద‌న్నారు. వీటిని ఏర్పాటు చేయ‌డంలో రోబోటిక్ సిస్ట‌మ్స్‌ శ‌క్తిమంతంగా ప‌ని చేస్తాయ‌ని సంగీత్ కుమార్ అన్నారు. గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో గ‌ల రిల‌య‌న్స్ రిఫైన‌రీలో ఆటోమేష‌న్ డిజైన్ చేసింది ఆడ్‌వెర్బ్‌.. రిల‌య‌న్స్ ఆయిల్, గ్యాస్ స్టోరేజీ ఫెసిలిటీస్‌లో ఆడ్‌వెర్బ్ రోబోస్ హెల్ప్ చేయ‌నున్నాయి.  నోయిడా కేంద్రంగా ఇండియ‌న్ రోబోటిక్స్ స్టార్ట‌ప్ ఆడ్‌వెర్బ్ త‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. దీనిని స్థాపించి ఐదేండ్లు అవుతోంది. సాఫ్ట్‌వేర్ నుంచి హార్డ్‌వేర్ వ‌ర‌కు రోబోటిక్స్‌లో ప్ర‌తి అంశాన్ని క‌వ‌ర్ చేస్తూ ప‌ని చేస్తున్న ప‌రిమిత కంపెనీల్లో ఆడ్‌వెర్బ్ ఒక‌టిగా కొన‌సాగుతున్న‌ది. 

Follow Us:
Download App:
  • android
  • ios