ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  మంగళవారం ఉదయం శ్రీ తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి నిర్వహించిన అర్చక సేవలో కుమారుడు అనంత్ అంబానీతో కలిసి పాల్గొన్నారు.

ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఈశా అంబానికి ఇటీవల వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె వెడ్డింగ్ కార్డులో తిరుమల ఆలయానికి వచ్చారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు.

అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో  సత్కరించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.