PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోదీ వైట్‌హౌస్‌కు విందు కోసం చేరుకున్నారు. అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోదీ వైట్‌హౌస్‌కు విందు కోసం చేరుకున్నారు. అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏర్పాటు చేసిన ఈ విందుకు పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా అతిథులు హాజరయ్యారు.
ప్రముఖ భారతీయ సంతతికి చెందిన పరిశ్రమ అధికారులు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల మరియు ఇంద్రా నూయి, Apple CEO టిమ్ కుక్‌లు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. అలాగే.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా, భారత ప్రభుత్వ ప్రతినిధులు ఈ విందుకు హాజరవుతున్నారు. అలాగే.. విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి, భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా హజరు కాకున్నారు.
వీరే కాకుండా.. భారత సంతతికి చెందిన US ప్రతినిధులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్ లు విందులో పాల్గొనే ఇతర అతిథులలో ఉన్నారు. US ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతిథి చెఫ్ నినా కర్టిస్, ఇతర వైట్ హౌస్ చెఫ్‌లతో కలిసి స్టేట్ డిన్నర్ కోసం మెనుని సిద్ధం చేశారు.
మోదీ డిన్నర్ మెనూలో ఏముంది?
ప్రధాని మోదీ శాకాహారి. ఆకు కూరలు, కూరగాయల వంటకాల్లో నైపుణ్యం కలిగిన చెఫ్ నినా కర్టిస్‌ను వైట్ హౌస్ సిబ్బందితో కలిసి పని చేసి అద్భుతమైన శాఖాహార మెనూని రూపొందించమని జిల్ బిడెన్ కోరారంట. అయితే అతిథులు మెయిన్ కోర్స్‌లో నాన్ వెజ్ కూడా ఉంటుందట.
ప్రధాన వంటకాలు ...ప్రధాని మోడీకి ఇచ్చే ప్రత్యేక విందులో మిల్లెట్ ఆధారిత వంటకాలు ఉండనున్నాయి. ఈ వంటకాల్లో మెరినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ పుచ్చకాయ, టాంగీ అవోకాడో సాస్, స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్‌లు, క్రీము కుంకుమపువ్వుతో కలిపిన రోజ్, రిసోట్టో, సుమాక్ కాల్చిన సీ బాస్, నిమ్మకాయ-మెంతులు పెరుగు సాస్, క్రిస్ప్డ్ మిల్లెట్ కేకులు, వేసవి స్క్వాష్‌లు మెనూలో ఉన్నాయి. "అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని జరుపుకోవడానికి భారతదేశం నాయకత్వం వహిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేము మా మెనూలో మెరినేట్ చేసిన మిల్లెట్‌లను చేర్చుకున్నాము" అని నినా కర్టిస్ చెప్పారు.
విందులో ముఖ్య అతిథులు వీరే ..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
US వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో
కాంగ్రెస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ
Adobe CEO శంతను నారాయణ్
US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్
జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్
భారతీయ-అమెరికన్ చిత్రనిర్మాత M. నైట్ శ్యామలన్
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా
పెప్సికో మాజీ ఛైర్మన్, CEO ఇంద్రా నూయి,
రిలయన్స్ ఛైర్మన్, MD ముఖేష్ అంబానీ
ఈ అతిథులు కాకుండా, విందుకు హాజరు కావడానికి ఇంకా చాలా మంది అతిథులు వైట్ హౌజ్ కు చేరుకున్నారు.
