ఉత్తరప్రదేశ్‌లోని జైలులో పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు, పాక్ తొలి అధ్యక్షుడు మహ్మద్ అలీ జిన్నా ఫోటో కనిపించడం వివాదానికి దారి తీసింది. జైలు ప్రాంగణంలో స్వాతంత్ర్య సమరయోధుడు అష్ఫకుల్లాఖాన్క స్మారక దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, బహదూర్ షా జాఫర్, టిప్పు సుల్తాన్ వంటి వ్యక్తుల ఫోటోల పక్కన మహ్మద్ అలీ జిన్నా ఫోటో ఉండటంతో దుమారం రేగింది. దీనిపై విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప యోధుడు అష్ఫకుల్లా ఖాన్ స్మారకార్ధం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్నా ఫోటో పెట్టడం ఏంటంటూ బీజేపీ, వీహెచ్‌పీలు ఆగ్రహాం వ్యక్తం చేశాయి. కాగా, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే వేద్ గుప్తా తెలిపారు.