Asianet News TeluguAsianet News Telugu

ఎంఎస్ ధోనీ తమిళనాడు దత్తపుత్రుడు.. ఆయనకు నేను పెద్ద అభిమాని - సీఎం ఎంకే స్టాలిన్

ఎంస్ ధోనికి తాను పెద్ద అభిమానిని అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి దత్త పుత్రుడని అన్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ధోనీ తన కృషితో జాతీయ ఐకాన్ గా ఎదిగాడని కొనియాడారు. 

MS Dhoni is the adopted son of Tamil Nadu. I am his big fan - CM MK Stalin..ISR
Author
First Published May 9, 2023, 10:00 AM IST | Last Updated May 9, 2023, 10:00 AM IST

ఎంఎస్ ధోని తమిళనాడు దత్తపుత్రుడని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. తాను కూడా ఆయనకు పెద్ద అభిమానిని అని అన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘తమిళనాడు ఛాంపియన్షిప్ ఫౌండేషన్ ను ’ మస్కట్ తో పాటు థీమ్ సాంగ్ ను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్ ధోని ముఖ్య అతిథిగా హాజరై ఈ ఫౌండేషన్ లోగో, పోర్టల్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రికెట్ తో అనేక క్రీడలలో చాలా మంది ధోనీలను సృష్టించాలనుకుంటోందని అన్నారు. ‘తమిళనాడులో అందరిలాగే నేను కూడా ధోనీకి పెద్ద అభిమానిని. ఇటీవల ధోనీ బ్యాటింగ్ చూసేందుకు చెపాక్ (క్రికెట్ స్టేడియం)కు రెండుసార్లు వెళ్లాను. తమిళనాడుకు చెందిన మా దత్తపుత్రుడు సీఎస్ కే (చెన్నై సూపర్ కింగ్స్) తరఫున ఆడతాడని ఆశిస్తున్నా’ అని అన్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ధోనీ తన కృషితో జాతీయ ఐకాన్ గా ఎదిగాడని స్టాలిన్ కొనియాడారు. కోట్లాది మంది యువతకు ఆయన స్ఫూర్తి అని అన్నారు. అందుకే ఆయన ఈ ప్రత్యేక కార్యక్రమానికి (టీఎన్ ఛాంపియన్షిప్ ఫౌండేషన్) అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. 

ఆయన కుమారుడు, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి తన సొంత నిధుల నుంచి ఫౌండేషన్ కు రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ఆదర్శంగా నిలిచే ఈ ఫౌండేషన్ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతుందని ఆయన చెప్పారు. మే 3న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఐదు రోజుల్లోనే ప్రభుత్వ వాటాతో కలిపి మొత్తం రూ.23.50 కోట్లు విరాళంగా వచ్చాయని చెప్పారు. రాష్ట్రాన్ని భారత ఉపఖండం క్రీడాశక్తిగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని యువతలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఫౌండేషన్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios