దేశంలో త్రిపుల్ తలాక్ ని  నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చినప్పటికీ...ఇంకా అలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా... ఓ మహిళకు ఆమె భర్త త్రిపుల్ తలాక్ చెప్పాడు. కాగా... భర్తతో ఆమెకు ఉన్న సమస్యను పరిష్కరిస్తానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భోపాల్ నగరానికి చెందిన ఓ భర్త తన భార్యతో గొడవపడి ఆమెకు త్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. అనంతరం భోపాల్ నగరానికి చెందిన ఓ మాంత్రికుడు రంగప్రవేశం చేసి భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరిస్తానని నమ్మించాడు. అదే విషయాన్ని సదరు మహిళ భర్తతో చెప్పి, ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన భార్యను తన ఫ్లాటుకు తీసుకువెళ్లాడు.

 ‘హలాలా’ పేరిట ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన మహిళపై మాంత్రికుడు అత్యాచారం చేశాడు. అనంతరం అతని భార్యను భర్తకు అప్పగించగా భర్త భార్యతో కాపురం చేసేందుకు నిరాకరించాడు. దీంతో భార్య ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన భర్తపై, దీన్ని అవకాశంగా తీసుకొని తనపై అత్యాచారం చేసిన మాంత్రికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తాము ఇద్దరిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని భోపాల్ నగర ఎస్పీ అలీంఖాన్ చెప్పారు.