Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ రఘురామపై థర్డ్ డిగ్రీ.. స్పందించిన సుమలత

ఎంపీ రఘురామ పై కస్టడీ లో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్భ్రాంతికరమని, నమ్మలేకపోతున్నామని. కర్ణాటక రాష్ట్రం మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు.

MP Sumalatha Response on Raghurama krishnama Raju Issue
Author
Hyderabad, First Published Jun 5, 2021, 8:02 AM IST

లోక్ సభ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఇటీవల పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా...  ఆయనను అలా పోలీసులు కస్టడీలోకి తీసుకొని.. ఆయనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడాన్ని మాండ్య ఎంపీ సుమలత స్పందించారు.

ఎంపీ రఘురామ పై కస్టడీ లో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్భ్రాంతికరమని, నమ్మలేకపోతున్నామని. కర్ణాటక రాష్ట్రం మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. సుమలత.. ఒకప్పటి సినీ నటి, కర్ణాటకలో గతంలో మంత్రిగా చేసిన దివంగత నటుడు అంబరీశ్ భార్య అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంబరీశ్ చనిపోయిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

 

కాగా.. తాజాగా ఆమె రఘురామ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం షాక్‌కు గురిచేసిందని శుక్రవారం ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై చాలా చెడు ప్రభావం చూపిస్తుందన్నారు. సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని, జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios