న్యూఢిల్లీ:దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన  సైనికుల గురించి  మాట్లాడే హక్కు  రక్షణ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ సుభాష్‌కు లేదని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన సైనికుల గురించి తన అధికారిక ట్విట్టర్‌లో  డాక్టర్ సుభాష్ చేసిన వ్యాఖ్యలపై రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇతనికి వివరణ ఇవ్వండి దయచేసి అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

సైనికుల గురించి రక్షణ శాఖ అధికార ప్రతినిధ సుభాష్ అక్టోబర్ 26వ తేదీన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలు చేసిన  తర్వాత సుభాష్ సెలవుపై వెళ్లారు. సుభాష్ వ్యాఖ్యలపై  పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు.