న్యూఢిల్లీ: గ్రేట్ బ్రిటన్ ఇండియా నుండి తీసుకెళ్లిన నిధుల చెల్లింపు విషయమై ఓ చర్చ జరగాల్సిన అసవరం ఉందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిధులను ఎప్పుడు, ఎలా గ్రేట్ బ్రిటన్ చెల్లిస్తోందనే విషయమై చర్చ జరగాలన్నారు.

 

గ్రేట్ బ్రిటన్  హాలండ్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లు ....ఏ ప్రజల నుండి సంపాదించిన ఆస్తులను ఆ దేశ ప్రజలకు ఇచ్చే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంపద ఎవరికి చెందుతోందో.. వారికి ఈ సంపదను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ఓ ఫోటోను కూడ తన ట్వీట్‌కు జత చేశారు. బ్రిటిష్ వలస పాలనలో  ఇండియా నుండి  పెద్ద ఎత్తున నిధులను దోచుకెళ్లారు. ఈ విషయంలో వెబ్‌సైట్ ప్రచురించిన వార్తాకథనాన్ని జోడిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు.