భారతదేశంలోని ప్రముఖుల సమాచారంపై చైనా నిఘా ఉంచిందన్న వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రముఖుల జాబితాలో రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగలా, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ల పేర్లు కూడా ఉన్నట్టు తెలియవస్తుంది. 

దీనిపై వివరణ ఇచ్చిన చైనా..... ఇదొక ప్రైవేట్ కంపెనీ అని, ఇందులో అక్రమంగా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమి లేవని, తాము సేకరించితిన్ సమాచారం అంతా కూడా సోషల్ మీడియా ఆధారంగానే అని, దీనితో చైనా సైన్యానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. 

భారతదేశ ప్రధాని, రాష్ట్రపతి సహా ప్రముఖుల కార్యకలాపాలపై చైనా నిఘా పెట్టిందన్న విషయం పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించింది. 

కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఈ విషయంలో ప్రభుత్వాన్ని రాజ్యసభలో నిలదీశారు. భారత ప్రముఖులపై చైనా నిఘా పెడితే.... ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వివరించాలంటూ డిమాండ్ చేసారు. 

ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందిస్తూ.... దీనిపై ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వారి త్వరలోనే నివేదికనుకి అందిస్తారని తెలిపారు.