ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఉదారత: ఎన్‌బీఎఫ్ ఫౌండేషన్‌కి 15 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల అందజేత
: కరోనాతో ఇబ్బంది పడుతున్న కరోనా రోగులకు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ 15 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించారు.
బెంగుళూరు: కరోనాతో ఇబ్బంది పడుతున్న కరోనా రోగులకు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ 15 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించారు.కరోనా బాధితులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించేందుకు నమ్మా బెంగుళూరు పౌండేషన్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ పౌండేషన్ ఛైర్మెన్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ 15 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లనుట్రస్టుకు అందించారు.
కరోనాతో ఇబ్బందిపడుతున్న రోగులకు ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందిస్తారు. బెంగుళూరులో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్నాయి. ఆక్సిజన్ కొరతతో పాటు మెడిసిన్స్ కొరత కూడ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా అత్యధికంగా కరోనా ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. సకాలంలో ఆక్సిజన్ అందితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.
గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఎన్‌బీఎఫ్ ఇతర సంస్థలతో కలిసి రూ. 24 కోట్ల విలువైన ఆహారం, నిత్యావసర సరుకులను బెంగుళూరులోని 4.5 లక్షల మందికి అందించింది. ప్రస్తుతం బీబీఎంపీతో కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎన్‌బీఎఫ్ పాలుపంచుకొంటుంది.వ్యాక్సినేషన్ ప్రక్రియలో విజయవంతం చేసేందుకు స్థానికులు ముందుకు రావాలని పౌండేషన్ కోరింది.
ఇలాంటి కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. 80 జీ కింద పన్ను కూడ మినహాయింపు పొందే అవకాశం ఉంటుందని ఎన్బీఎఫ్ ప్రకటించింది. విరాళాలు అందించేవారు 9591143888 / 7349737737 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరింది. మరోవైపు vinod.jacob@namma-bengaluru.org or usha.dhanraj@namma-bengaluru.org. కు మెయిల్స్ ద్వారా కూడ ఇతర వివరాలు తెలుసుకోవచ్చని ఆ సంస్థ కోరింది.