Asianet News TeluguAsianet News Telugu

పేదలకు అండగా ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

కోవిడ్ -19 సెకండ్ వేవ్ నుండి బెంగళూరు ప్రజలకు అండగా నిరంతర కృషి, పోరాటంలో భాగంగా పార్లమెంటు సభ్యుడు, నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ట్రస్టీ  వ్యవస్థాపకులు  రాజీవ్ చేంద్రశేఖర్ బెంగుళూరు ఫైట్స్ కరోనా మలి దశను నిన్న ప్రారంభించారు.

MP Rajeev Chandrasekhar at the forefront helping poor during the unprecedented crisis
Author
Bengaluru, First Published May 27, 2021, 10:15 AM IST

కోవిడ్ -19 సెకండ్ వేవ్ నుండి బెంగళూరు ప్రజలకు అండగా నిరంతర కృషి, పోరాటంలో భాగంగా పార్లమెంటు సభ్యుడు, నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ట్రస్టీ  వ్యవస్థాపకులు  రాజీవ్ చేంద్రశేఖర్ బెంగుళూరు ఫైట్స్ కరోనా మలి దశను నిన్న ప్రారంభించారు. కరోనా రోగులకు అండగా నిలుస్తూ వారికి పండ్లు, అవసరమైన నిత్యావసరాలను అందించారు. 

అయితే ఇంతకు ముందు కూడా  నమ్మ బెంగళూరు ఫౌండేషన్ దేనబందునగర్ ప్రాంతానికి చెందిన పేద,  వృద్ద ప్రజలకు వెల్ నెస్ అండ్ ఇమ్యునిటీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బిబిఎంపి మాజీ మేయర్ శ్రీ గౌతమ్ కుమార్, సర్ సి.వి.రామన్ హాస్పిటల్ ఇందిరానగర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ ప్రారంభించారు.

ఆర్‌డబ్ల్యుఎ & సిటిజెన్ గ్రూపులు ఈ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్‌లో ఎన్‌బిఎఫ్‌తో కలిసి పాల్గొన్నాయి. ఈ కిట్లలో పారాసిటమాల్ డోలో - 500ఎంజి, విటమిన్ సి ఐఎక్స్ఐఎస్ విత్ జింక్, జిన్‌కోవిట్, ఓఆర్ఎస్, మాస్క్‌లు, శానిటైజర్ ఉన్నాయి.

ఈ  కిట్ల పంపిణీ ముఖ్య  ఉద్దేశ్యం  ఏంటంటే ప్రజలలో రోగనిరోధక శక్తిని పెంచడం అలాగే  కొనసాగుతున్న కరోనా మహమ్మారి నుండి వారిని సురక్షితంగా ఉంచడం కోసం. రాబోయే వారాల్లో ఇలాంటి మరిన్ని ప్రదేశాలకు ఈ కార్యక్రమం చేరుకోవాలని ఇంకా 1 లక్షకు పైగా కిట్లను బలహీనంగా ఉన్నవారికి పంపిణీ చేయాలని ఎన్‌బి‌ఎఫ్ యోచిస్తోంది.

ఇప్పటికే ఎన్‌బిఎఫ్ ఏర్పాటు చేసిన అనేక టీకా శిబిరాలకు కొనసాగింపుగా ఈ ప్రాంతాలలో టీకా శిబిరాలను ఏర్పాటు చేయడంలో సహాయపడటంతో పాటు కరోనా టీకాలపై అవగాహన, టీకాల  కోసం రిజిస్ట్రేషన్లు, ఆక్సిమీటర్లు, ఓ2 కాన్సంట్రేటర్లు వంటి ఆరోగ్య పరికరాలను అందించడం కొనసాగించనుంది.

ప్రస్తుతం బెంగళూరు  కరోనా మహమ్మారి సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కన్సెంట్రేటర్స్ అవసరం. ఇప్పటివరకు ఎన్‌బిఎఫ్ 20కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేసి దానం చేసింది. అలాగే బెంగళూరి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి మరిన్ని చేస్తూనే ఉంటుంది.

నమ్మ బెంగళూరు ఫౌండేషన్ గురించి:
నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఒక ఎన్‌జి‌ఓ, ఇది బెంగళూరు, బెంగళూరు పౌరులను వారి హక్కులను పరిరక్షించడానికి పనిచేస్తుంది. ఇది  ఒక  ఉతమైన బెంగళూరు నగరం కోసం న్యాయవాద, పార్ట్నర్ షిప్, ఆక్టివిజం ద్వారా పనిచేస్తుంది. సిటీ ప్లానింగ్, గవర్నన్స్, అవినీతిపై పోరాడటానికి, ప్రజా ధనం, ప్రభుత్వ ఆస్తుల జవాబుదారీతనం నిర్ధారించడానికి ఈ ఫౌండేషన్ ప్రజలకు ఒక వేదికగా పనిచేస్తుంది.

మరింత సమాచారం కోసం:
వినోద్ జాకబ్
ఇ-మెయిల్: vinod.jacob@namma-bengaluru.org
మొబైల్: +91 73497 37737

Follow Us:
Download App:
  • android
  • ios