మాజీ సినీ నటి, స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్.. లోక్ సభలో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని ప్రధాని మోదీ చాలా సందర్భాలలో చెప్పారని, కానీ నేడు అది నిజమని ఆయన నిరూపించారని నవనీత్ కౌర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి పది రోజుల ముందే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని ఆమె అన్నారు.

‘‘ఎప్పుడెప్పుడు వెళ్లి నేను కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలా అన్న ఆలోచనతో రాత్రంతా నాకు నిద్ర రాలేదు. ఈ చరిత్రాత్మక బిల్లును సమర్థించడం యువ ఎంపీల బాధ్యత’’ అని ఆమె అ,న్నారు.
 
తన ప్రసంగం మధ్యలో నవ్‌నీత్‌ కౌర్‌ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రసగింస్తుండగా కొంతమంది తెలుగు ఎంపీలు ఏదో వ్యాఖ్యానించారు.. దీంతో ఆమె తెలుగులో మాట్లాడుతూ..‘‘ నాకు రెండు నిమిషాలు సమయమివ్వడండి.. మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? స్వతంత్ర అభ్యర్థిగా నేను కూడా అప్పోజిషన్‌లో ఉన్నా.. కానీ ఈ బిల్లుకు మద్దతునివ్వాలని నేను భావిస్తున్నా’’ అని ఆమె తెలుగులో మాట్లాడారు.