ప్రేమించిన పెళ్లిచేసుకున్న వారిని మీరు చాలా మందినే చూసి ఉంటారు. అలా కాదని... పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకున్న వాళ్లని కూడా చూసే ఉంటారు. కానీ.. ఒకేసారి.. తాను ప్రేమించిన అమ్మాయిని.. తన ఇంట్లో పెరేంట్స్ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూశారా.. అసలు అది సాధ్యమేనా..? మధ్యప్రదేశ్ లో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రం బెతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తికి  పక్క గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఇదే విషయాన్ని పేరెంట్స్... సందీప్ కి చెప్పారు. అయితే.. అప్పటికే తాను మరో అమ్మాయిని ప్రేమించానంటూ సందీప్ బాంబు పేల్చాడు.

దీంతో.. ఏం చేయాలో తెలియక కుటుంబసభ్యులు స్థానిక పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లారు. పంచయాతీలో పెద్దలు సందీప్ తో కలిసి జీవించేందుకు ఇద్దరు అమ్మాయిలకు ఇష్టమైతే పెళ్లి జరిపించండి అని చెప్పారు. దీనికి సందీప్, ఆ ఇద్దరు అమ్మాయిలు.. కుటుంబసభ్యులు కూడా అంగీకరించారు.

ఇంకేముంది.. అనుకున్న సమయానికి సందీప్.. ఇద్దరు అమ్మాయిల మెడల్లో తాళి కట్టేసి పెళ్లిచేసుకున్నాడు. కాగా... ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో... ఈ విషయం కాస్త.. అధికారులకు తెలిసిపోయింది. దీంతో.. అధికారులు విచారణ చేపట్టారు.