దొంగ సింపతీ కోసం చంద్రబాబు ప్రయత్నం: ఎంపీ జీవీఎల్

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 14, Sep 2018, 7:15 PM IST
mp gvl fires on chandrababu naidu
Highlights

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. బాబ్లీ విషయంలో దొంగ సింపతీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసిందని విమర్శించారు. అవసరాలకు వాడుకోవడం కోసమే మరో డ్రామాకు తెరతీశారన్నారు.  
 

ఢిల్లీ:   ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. బాబ్లీ విషయంలో దొంగ సింపతీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసిందని విమర్శించారు. అవసరాలకు వాడుకోవడం కోసమే మరో డ్రామాకు తెరతీశారన్నారు.  

కేవలం డ్రామా రాజకీయాలకే పరిమితమైన టీడీపీ, పోరాటం అని చెప్పి ఆరాటపడుతోందని ఘాటుగా విమర్శించారు. 2010 ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారని ఆరోపించారు. అప్పుడు కూడా బాబ్లీ దగ్గర దొంగ నాటకం ఆడారని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్నా ఉల్లంఘించడంతో మహారాష్ట్ర పోలీసులు దురుసుగా ప్రవర్తించారని అది వాస్తవమన్నారు. 

బాబ్లీ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిందని గుర్తు చేశారు. ఎవరిని అయితే కౌగిలించుకుని తమ మిత్రుడు అంటున్నారో ఆ రాహుల్ గాంధీ హయాంలోనే కేసులు పెట్టారన్నారు. అప్పుడు కేసులు పెట్టిన రాహుల్ గాంధీతో ఇప్పుడు డ్యూయెట్ లు పాడుకుంటున్నారని మండిపడ్డారు. 

నాన్ బెయిలబుల్ వారెంట్ విషయం బీజేపీకి సంబంధం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసు ఇంత వరకు బయటకు రాలేదని, ఆయనపై ఉన్న కేసులన్నింటిపై స్టే ఉందని జీవీఎల్ పేర్కొన్నారు. పీడీ అకౌంట్ల విషయంలో దర్యాప్తు చేస్తే చంద్రబాబు నాయుడు అవినీతి భాగోతం బయటపడుతుందని దుయ్యబుట్టారు.

loader