గతజన్మ జ్ఞాపకం.. అడుక్కోవడానికి వెళ్లాలి..ఆదివారం సెలవివ్వండి.. డిప్యూటీ ఇంజనీర్

madhyapradesh కు చెందిన raj kumar yadav ఈ వింత లీవ్ లెటర్ సృష్టికర్త. డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి. దయచేసి నాకు leave మంజూరు చేయమంటూ తనపై అధికారులను అభ్యర్థించాడు. 

MP Engineer Asked For Sunday Off To Do Bhagavad Gita Paath, His Senior's Reply Wins The Internet

భోపాల్ : సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతేనే.. లేక వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెడతాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ లీవ్ లెటర్ ని చూస్తే.. ఇదేందిరా భయ్ ఇలాంటి వాటిని కూడా సెలవు అడుగుతారా అనిపిస్తుంది. ఆ వెరైటీ లీవ్ లెటర్ వివరాలు ఇలా ఉన్నాయి. 

madhyapradesh కు చెందిన raj kumar yadav ఈ వింత లీవ్ లెటర్ సృష్టికర్త. డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి. దయచేసి నాకు leave మంజూరు చేయమంటూ తనపై అధికారులను అభ్యర్థించాడు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న నీవు అడుక్కోవడం ఏంటయ్యా అని రాజ్ కుమార్ ను ప్రశ్నించిన ఉన్నతాధికారులు అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. 

వారిని షాక్ కు గురి చేసిన ఆ సమాధానం ఏమిటంటే తనకు గతజన్మ జ్ఞాపకాలను గుర్తుకు వచ్చాయని... అందుకే భిక్షాటన చేయాలనుకుంటున్నానని తెలిపాడు. అంతేకాదు తనలోని అహాన్ని చెరిపి వేయడానికి మతపరమైన అన్వేషణ చేస్తూ... ఆత్మశోధన చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు రాజ్ కుమార్.

మరింత ఆశ్చర్యకరం ఏమిటంటే పూర్వజన్మలో రాజ్ కుమార్, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు asaduddin owaisi, ఆర్ఎస్ఎస్ చీఫ్ mohan bhagwat ముగ్గురు మంచి స్నేహితులట. వీరంతా మహాభారత కాలంలో స్నేహితులుగా ఉండేవారట.. ఇక వీరిలో ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు కాగా మోహన్ భగవత్ శకుని మామ అట. 

గత జన్మలో వీరు ఇద్దరు రాజ్ కుమార్ ప్రాణ స్నేహితులట. అంతేకాక ఆదివారం సెలవు పెట్టి భిక్షాటనతో పాటు మరిన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలని భావిస్తున్నట్లు రాజ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నాడు. 

ఇక ఈ లేఖ చదివిన రాజ్ కుమార్ ఉన్నతాధికారులు ఇచ్చిన రిప్లై కూడా మరింత ఫన్నీగా ఉంది. జనపద్ పంచాయతీ సీఈఓ పరాగ్ పంథి, ‘ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్, మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంతో మా సహకారం మీకు సహాయపడుతుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం’ అని రిప్లై ఇచ్చారు.

బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో లొంగిపోయిన డీఎంకే ఎంపీ రమేష్...

సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ లీవ్ లెటర్ పై నెటిజనులు ఇలాంటి బిత్తిరి జనాలు మన దగ్గరే ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios