మొత్తంగా 1954 నుంచి ఇలా నిషేధిస్తూ వస్తున్న పదాలు, వ్యాఖ్యల సంఖ్య 1161కి చేరింది. ఇందుకు సంబంధించిన 38 పేజీల బుక్ లెట్ ను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం విడుదల చేశారు.
అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మధ్యప్రదేశ్ శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. పప్పు, చోర్, మిస్టర్ బంటాధార్, వెంటిలేటర్ వంటి పదాలు, వ్యాఖ్యలను సభలో పలకకుండా నిషేధం విధించింది. ఏయే పదాలను సభలో వాడకూడదో పేర్కొంటూ జాబితాను అసెంబ్లీ స్పీకర్ జారీచేశారు.
మొత్తంగా 1954 నుంచి ఇలా నిషేధిస్తూ వస్తున్న పదాలు, వ్యాఖ్యల సంఖ్య 1161కి చేరింది. ఇందుకు సంబంధించిన 38 పేజీల బుక్ లెట్ ను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం విడుదల చేశారు. పప్పు.. అనే పదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అవహేళన బీజేపీ నేతలు ఉపయోగిస్తుండడం తెలిసిందే. కాగా, వెంటిలేటర్ పదాన్ని నిషేధించడానికి కాంగ్రెస్ తప్పు పడుతోంది.
