Asianet News TeluguAsianet News Telugu

‘తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షిత ప్రాంతాలు..’ పదకొండో తరగతి బాలిక సూసైడ్ నోట్.. ఎంత వేదన అనుభవించిందో..

చెన్నైలోని పూనమల్లే ప్రాంతానికి చెందిన11వ తరగతి విద్యార్ధిని కొద్ది రోజుల క్రితం అదృశ్యం అయింది. తాజాగా పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంట్లో ఓ సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ లేఖలో ‘తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళలకు సురక్షితమైన ప్రదేశాలు’ అని ఆమె రాసుకొచ్చింది.

Mothers Womb, Grave Only Two Safe Places : Minor Sexual Harassment Victims Suicide note
Author
Hyderabad, First Published Dec 20, 2021, 7:35 AM IST

చెన్నై : పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఏ మహిళకు కూడా సమాజంలో రక్షణ లేకుండా పోయింది. అనువైన ప్రాంతాల్లో కంటికి ఎవరు చిక్కినా కామాంధులు వారిపై పంజా విరుసుతున్నారు. దేశంలో అనేక చోట్ల ప్రతిరోజూ అత్యాచార ఘటనలు, వేధింపులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలాంటి మానసిక వేధింపులకు గురైన ఓ బాలిక.. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించి చివరికి తనువు చాలించింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తుంది.

చెన్నైలోని పూనమల్లే ప్రాంతానికి చెందిన11వ తరగతి student కొద్ది రోజుల క్రితం అదృశ్యం అయింది. తాజాగా పోలీసులు ఆమె dead bodyన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంట్లో ఓ Suicide noteను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ లేఖలో ‘తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళలకు సురక్షితమైన ప్రదేశాలు’ అని ఆమె రాసుకొచ్చింది.

అయితే, తన కుమార్తె 9వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిందని.. ఆ స్కూల్ లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడి కుమారుడు తన కుమార్తెను వేధించేవాడని తల్లి పోలీసులకు తెలిపింది. ఈ కారణంగానే ఇప్పుడు మరో పాఠశాలలో చేర్పించినట్లు వివరించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, గుంటూరులో ఇలాగే ఓ పదమూడేళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించిందో దుర్మార్గురాలు. ఓ వ్యక్తి తన భార్య, కూతురికి corona virus సోకడంతో గుంటూరు GGHలో చేర్పించాడు. అక్కడ వారిద్దరూ చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్లో భార్య చనిపోయింది. ఆ బాలికకు తండ్రి తప్ప మరెవరూ లేరని guntur స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ తెలుసుకుంది. తాను ఆస్పత్రిలో నర్సు అని ఆ బాలిక తండ్రిని నమ్మించింది. నాటువైద్యం చేయిస్తానని బాలికను ఇంటికి తీసుకెళ్ళి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో prostitution చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్ గ్యాంగ్​రేప్​ కేసు : 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష... కోటా కోర్ట్ సంచలన తీర్పు

అనారోగ్యం పాలైన ఆ బాలిక రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకుని జరిగిన విషయం తండ్రికి చెప్పింది. తండ్రి ఫిర్యాదు మేరకు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసు స్టేషన్లో 
Zero FIR నమోదు చేసి కేసును అరండల్ పేట స్టేషన్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం  ఆ బాలికకు వైద్య పరీక్షలు  చేస్తున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితురాలు  వ్యభిచారం నిర్వాహకురాలు అని, Nurse కాదని పోలీసులు తెలుసుకున్నారు

పోలీసుల కథనం ప్రకారం..  పల్నాడులోని ఓ  పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలికకు  13 ఏళ్లు. కరోనా బారిన పడి జిజిహెచ్ లో చేరింది. గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ నమ్మించి తన వెంట ఇంటికి తీసుకెళ్లిన కొద్ది రోజులకే  వ్యభిచారం  చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పని చేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి, బయటకు రానీయకుండా కొన్నాళ్ళు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడకు సైతం తీసుకెళ్లి  వ్యభిచారం  చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Follow Us:
Download App:
  • android
  • ios